ETV Bharat / state

టీడీపీ,జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం-జగన్‌ అర్జునుడిగా పోల్చుకోవడం హాస్యాస్పదం: పవన్​ కల్యాణ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 9:12 PM IST

MP Balashowry Joins in Janasena: వైఎస్సార్​సీపీపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా ప్రకటించిన ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న బాలశౌరి, జనసేనలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.

mp_balashowry_joins_in_janasena
mp_balashowry_joins_in_janasena

MP Balashowry Joins in Janasena: వైఎస్సార్​సీపీ అధిష్టానం నిర్ణయాలు, ఆ పార్టీ నేతలతో అగ్రనేతలు, తోటి నాయకులు మసలుకునే విధానంతో అసంతృప్తి చెందిన నాయకులు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైఎస్సార్​సీపీని వీడారు. జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తమని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ అనే దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరి ఆశీస్సులు కావాలని కోరారు.

రాష్ట్రాభివృద్ధి కోరుకునే వ్యక్తి పవన్​ కల్యాణ్​: ఎంపీ బాలశౌరి

సిద్ధం పేరుతో రాష్ట్రమంతా వైఎస్సార్​సీపీ పోస్టర్లు పెడుతోందని అన్నారు. జగన్‌ అబద్ధాలు చెప్పబోనన్నారని, ఆయన చెప్పేవే అబద్ధాలని పవన్‌ దుయ్యబట్టారు. సీపీఎస్‌ రద్దు, పోస్టుల భర్తీ వంటి జగన్​ హామీలపై ఎండగడతామని వెల్లడించారు.

ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసి సభలు నడుపుతున్నారని, వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కదానికి బదులు చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడని, రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాము వచ్చే తరం కోసం ఆలోచిస్తున్నమని, ఎన్నికల కోసం కాదని పవన్‌ స్పష్టం చేశారు.

చంద్రబాబుతో పవన్ కల్యాణ్​ భేటీ - సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం!

జగన్‌ అర్జునుడిగా పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్‌ అని, అలాంటి వ్యక్తి మహిళలను గౌరవిస్తారని అనుకోవట్లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వివేకా కుమార్తె తనకు రక్షణ లేదని ఆవేదన చెందుతున్నారని ప్రకటించారు. జగన్‌ మాత్రం తనను తాను అర్జునుడిలా పోల్చుకుంటున్నారని మండిపడ్డారు.

పవర్‌ స్టార్‌ కంటే ప్రజల కోసం పనిచేసే కూలీ అనుకుంటే సంతోషిస్తానని జనసేన అధినేత తేల్చి చెప్పారు. కష్టపడి పనిచేస్తానని ప్రజలు అనుకుంటే అదే నాకు పెద్ద బిరుదని వెల్లడించారు. పదవులపై ఆశ లేదని ప్రజల కోసం నిలబడాలనేది తన ఆకాంక్ష అని పేర్కోన్నారు.

కులగణనపై ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి - సీఎం జగన్​కు పవన్ కల్యాణ్​ లేఖ

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ సమక్షంలో వైఎస్సార్​సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. ఈ నేపథ్యంలో పవన్​, బాలశౌరిల అభిమానులు, కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జనసేన తీర్థం పుచ్చుకున్న బాలశౌరి, జనసేన కుటుంబసభ్యుడిగా తీర్ధం పుచ్చుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు అవసరం గురించి పవన్ తనతో చర్చించారని బాలశౌరి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని పవన్‌ కోరుకుంటున్నారని, వైఎస్సార్​సీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఎవరూ ముందుకు రావట్లేదని వివరించారు. రానున్న టీడీపీ - జనసేన ప్రభుత్వంలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నట్లు బాలశౌరి ప్రకటించారు.

పొత్తులో భాగంగానే పవన్ అభ్యర్థుల్ని ప్రకటించారు: బొండా ఉమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.