ETV Bharat / state

ఎన్నికల్లో ఓడినా ఆగని వైఎస్సార్సీపీ దాష్టీకాలు - 6 రోజుల్లో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య - YSRCP Mob Attacks

YSRCP Mob Attacks on TDP Leaders in AP : ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్సార్సీపీ మూకల దాష్టీకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులపై దాడులు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. తిరిగి టీడీపీ నాయకులే తమపై దాడి చేస్తున్నారని గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ysrcp_mob_attack
ysrcp_mob_attack (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 10:42 AM IST

ఎన్నికల్లో ఓడినా ఆగని వైఎస్సార్సీపీ దాష్టీకాలు - 6 రోజుల్లో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య (ETV Bharat)

YSRCP Mob Attacks on TDP Leaders in AP : దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన వైఎస్సార్సీపీ మూకలు, అధికారం కోల్పోయాక కూడా అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాక రాష్ట్రంలో గత ఆరు రోజుల్లో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ అరాచక శక్తులు బలిగొన్నాయి. అనేక చోట్ల భౌతిక దాడులకు తెగబడుతున్నాయి.

ఫలితాలు వెల్లడైన రోజే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన టీడీపీ కార్యకర్త షేక్‌ ఖాశీంను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కర్రలు, క్రికెట్‌ బ్యాట్లతో కొట్టి పాశవికంగా చంపేశారు. తమ పార్టీ గెలిచిన సంతోషంలో ఖాశీం ద్విచక్ర వాహనానికి టీడీపీ జెండా కట్టుకుని స్నేహితుడితో కలిసి తిరుగుతుండగా, ఓటమిని జీర్ణించుకోలేని వైఎస్సార్సీపీ మూకలు ఈ దారుణానికి ఒడిగట్టాయి.

తాజాగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లిలో టీడీపీ కార్యకర్త గిరినాథ్‌ చౌదరిని వేట కొడవళ్లతో వెంటాడి నరికేశారు. ఆయన సోదరుడు కల్యాణ్‌ పైనా హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటనలో ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆమె అనుచరుల పాత్ర ఉందని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ మూకలు, ‘దొంగే.. దొంగా దొంగా’ అన్న రీతిన పెడబెబ్బలు పెడుతున్నాయి.

ఓటమిని భరించలేక వైఎస్సార్సీపీ మూకల దాడి- టీడీపీ నేతలకు తీవ్రగాయాలు - YSRCP ATTACKS

రాష్ట్రంలో టీడీపీ శ్రేణులే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున హింసాకాండను ప్రోత్సహిస్తుంటే ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఏమీ తెలియనట్లుగా రాష్ట్రంలో టీడీపీ దాడులతో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారంటూ ఇటీవల ట్వీట్‌ చేశారు. ఆ పార్టీ నాయకులు గవర్నర్‌ను కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను కిరాతకంగా చంపడమే వైఎస్సార్సీపీ దృష్టిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

వైఎస్సార్సీపీ నేతల దాష్టీకం- టీడీపీకి ఓటేశారని ముగ్గురిపై దాడి - YCP ACTIVISTS ATTACK ON TDP

ఓటమి కసితో దాడులు చేస్తున్నదీ, హింసను ప్రేరేపిస్తున్నదీ, ఉన్మాదంతో రెచ్చిపోతూ ప్రాణాలు తీస్తున్నదీ వైఎస్సార్సీపీ వాళ్లే. ఈ అకృత్యాలను కప్పిపుచ్చు కునేందుకు నెపాన్ని ఇతరులపై నెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నియమితులై ఆ పార్టీకి అంటకాగిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఇప్పటికీ అదే పంథాలో వెళ్తున్నారు. కొందరైతే పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ పక్షపాత వైఖరిపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించకపోతే శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే ముప్పు ఉందన్న భావన వ్యక్తమవుతోంది.

ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేని వైఎస్సార్సీపీ శ్రేణులు పలుచోట్ల టీడీపీ వారిని కవ్విస్తున్నాయి. ప్రతిగా, టీడీపీ శ్రేణులు కూడా గతంలో తమపై జరిగిన దాడులను గుర్తుచేసుకుని వైఎస్సార్సీపీ దుందుడుకు చర్యల పట్ల స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడకక్కడా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలూ బాధితులు అవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ శ్రేణులు కవ్వించినా, రెచ్చగొట్టినా, సంయమనం పాటించాలని వాటికి స్పందించొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

'మాకే వ్యతిరేకంగా పనిచేస్తారా'- మహిళపై వైఎస్సార్సీపీ నేతల దాడి - YSRCP Leaders Attack Women

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.