YSRCP Leaders Joining in TDP: ఎన్నికలు సమీపీస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. అధికార గర్వం, అభివృద్ధి లేమి, పార్టీ అదిష్టాన నియంతృత పోకడలు, గౌరమ మర్యాదల లోపం ఇవన్నీ నచ్చని ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీ నుంచి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు జడ్పీటీసీలు, కౌన్సిలర్ సహా పలువురు నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారు తెలుగుదేశంలో చేరారు.
శ్రీకాళహస్తి, వైఎస్సార్సీపీ నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడమే కాకుండా, చంద్రబాబు నివాసంలో కుప్పం, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ అధినేతతో సమావేశమయ్యారు. తెలుగుదేశంలో చేరికపై వారితో చంద్రబాబు చర్చించారు. ఈ నేపథ్యంలో బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, చంద్రబాబుతో సమావేశమయ్యారు.
వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న '250 కుటుంబాలు', ఎక్కడంటే?
టీడీపీ తీర్థం పుచ్చుకున్న శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ నేతలు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జడ్పీటీసీ కె. వెంకటసుబ్బారెడ్డి, ఏర్పేడు జడ్పీటీసీ కె. తిరుమలయ్య, తొట్టెంబేడు జడ్పీటీసీ పి .అర్చనాదేవి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు శ్రీకాళహస్తి 32వ వార్డు కౌన్సిలర్ వి. హరి నాయుడు, తొట్టెంబేడు మాజీ జడ్పీటీసీ పి. వెంకటాచలం తెలుగుదేశంలో చేరారు. వీరికి చంద్రబాబు తెలుగుదేశం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Joinings in TDP జడ్పీటీసీలు మాట్లాడుతూ తాము జడ్పీటీసీలుగా గెలిచామే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ చేపట్టలేకపోయామని వాపోయారు. స్థానిక సంస్థలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. అధికార పార్టీలో తమను బానిసలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి అభివృద్ధికి టీడీపే అధికారంలోకి రావాలి: శ్రీకాళహస్తిలో అవినీతి తప్ప అభివృద్ధి జరగడం లేదని వాపోయారు. టీడీపీ హయాంలోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరిగిందని జడ్పీటీసీలు అన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి అభివృద్ధి జరగాలంటే మళ్లీ టీడీపీనే అధికారంలోకి రావాలన్నారు. జగన్ ఎన్నికలకు సిద్దం అంటున్నారని, తాము యుద్దం అంటున్నామని అన్నారు. వైఎస్సార్సీపీలో ఎవ్వరూ మిగలడం లేదని ఎద్దేవా చేశారు.
పార్టీలో చేరిన వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అంతకముందు శ్రీకాళహస్తి నుంచి పెద్దఎత్తున వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
టీడీపీలోకి కోటంరెడ్డి సోదరుడు.. నెల్లూరు నుంచి మంగళగిరికి వందల కార్లతో ర్యాలీ..