ETV Bharat / state

వైసీపీని వెంటాడుతున్న వలసల భయం - బడా నేతలు సైతం పార్టీకి 'బైబై' - YCP LEADERS JOINING TDP - YCP LEADERS JOINING TDP

YSRCP Leaders Join in TDP: ఎన్నికలు సమీపించే కొద్ది రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. అయిదేళ్లలో అధికార పార్టీ చేసిన అరాచకాలు భరించలేక వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యమని భావించి వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

YSRCP_Leaders_Join_in_TDP
YSRCP_Leaders_Join_in_TDP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 7:43 PM IST

వైసీపీని వెంటాడుతున్న వలసల భయం - బడా నేతలు సైతం పార్టీకి 'బైబై'

YSRCP Leaders Join in TDP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని వలసల భయం వెంటాడుతోంది. ఇంతవరకు వైసీపీలో కొనసాగించిన వారందరూ ఒక్కొక్కరుగా టీడీపీ గూటికి చేరుతున్నారు. నిన్నా మెన్నటి వరకూ వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడగా, తాజాగా వైసీపీ నేతలకు కుడి భుజంగా ఉన్న నేతలు సైతం ఆ పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులకు సన్నితులుగా ఉన్న నేతలు పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆరోపిస్తున్నారు.

వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల పర్వం : సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల పర్వం కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సొంత మండలం నల్లమాడులోని నల్ల సింగరాయపల్లిలో వందమంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీధర్‌రెడ్డి సొంత మండలంలో ఇంత మంది వైసీపీను వీడి టీడీపీలోకి చేరటం కలకలం రేపుతోంది.

వైసీపీని వీడిన 300 కుటుంబాలు : ఎన్నికల సమిస్తున్న తరుణంలో విజయనగరం జిల్లాలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. జిల్లాలోని కొత్తపేటకు చెందిన ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, వైసీపీ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు ఆధ్వర్యంలో 300 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరాయి. వీరందరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు విజయనగరం శాసనసభ, లోక్ సభ అభ్యర్థులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, కలిశెట్టి అప్పలనాయుడులు టీడీపీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీడీపీ నేతలు : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కోనసాగుతున్నాయి. పోలాకి మండలం ఉరజాం యాట్ల, పసివలస గ్రామాల నుంచి 100 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో వీరందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి : అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల జోరు కొనసాగుతోంది. డి.హీరేహాల్‌, రాయదుర్గం మండలాల్లో సుమారు 70 కుటుంబాలు వైసీపీను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. వీరంత టీడీపీ పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

టీడీపీ గూటికి డొక్కా: ఈరోజు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్​ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్ష పదవికి ఇవాళ రాజీనామా చేసి నాలుగేళ్ల తర్వాత తిరిగి టీడీపీలో చేరారు.

'సూపర్​ సిక్స్' పథకాల ఆకర్షణ - పార్టీని వీడుతున్న వైసీపీ శ్రేణులు - YSRCP Leaders Join in TDP

ఎన్నికల దగ్గరపడుతున్న కొద్ది జోరుగా తెలుగుదేశంలోకి వైసీపీ నేతల చేరికలు - TDP to YCP

మంచివారు పార్టీలో ఉండలేరంటూ వైసీపీని వీడుతున్న శ్రేణులు-టీడీపీలోకి జోరుగా చేరికలు - Joinings to TDP From YSRCP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.