ETV Bharat / state

ప్రశాంత ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ కడప రాజకీయం - సిట్‌ దర్యాప్తు చేయాలని డిమాండ్లు - YSRCP Leaders Attack on Family - YSRCP LEADERS ATTACK ON FAMILY

YSRCP Leaders Attack on Family in Visakha: ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని సామాన్యులపై దాడులకు చేయడాన్ని ఇప్పటివరకు ఫ్యాక్షన్‌ ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. వైఎస్సార్సీపీ నేతల వల్ల ఈ సంస్కృతి ప్రశాంతతకు మారుపేరైనా ఉత్తరాంధ్రకి పాకింది. ఈ ఘటనల్ని సిట్‌ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

YSRCP Leaders Attack on Family in Visakha
YSRCP Leaders Attack on Family in Visakha (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 7:01 AM IST

ప్రశాంత ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ కడప రాజకీయం - సిట్‌ దర్యాప్తు చేయాలని డిమాండ్లు (ETV Bharat)

YSRCP Leaders Attack on Family in Visakha : ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని సామాన్యులపై దాడులకు చేయడాన్ని ఇప్పటివరకు ఫ్యాక్షన్‌ ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. వైఎస్సార్సీపీ నేతల వల్ల ఈ సంస్కృతి ప్రశాంతతకు మారుపేరైనా ఉత్తరాంధ్రకి పాకింది. వైఎస్సార్సీపీకి ఓటేయలేదని ఆ పార్టీ నాయకులు విశాఖలోని బర్మా కాలనీలో ఒక కుటుంబంపై దాడి చేశారు. ఉక్కుపాదంతో అణచివేయాల్సిన పోలీసులు దాన్నో కుటుంబ తగాదాగా చిత్రీకరించి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనల్ని సిట్‌ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

దాడి జరిగిందని బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేద్దమని వెళ్తే ఆయన లేరు. సంయుక్త కలెక్టరేమో కమిషనర్‌కి ఫిర్యాదు చేయమని చెప్పారు. దీంతో ఫిర్యాదు ప్రతిని ఎన్నికల సంఘానికి, రాష్ట్ర డీజీపీ పంపిస్తామని బాధితులు తెలిపారు.

బాధితులకు అండగా నిలిచిన వారికి పోలీసులు నోటీసులివ్వడం దారుణం: బీజేపీ నేతలు - BJP Leaders on YCP Leaders Attacks

ఎన్డీయే అభ్యర్థికి ఓటెలా వేస్తారు : టీడీపీ హయాంలో తమకు ఇల్లు మంజూరైందని ఇంటి ముందు అమర్చిన శిలాఫలకంలో ప్రధాని మోదీ, అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చిత్రాలున్నాయని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. ఇంటి ముందు కిళ్లీ కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని వైఎస్సార్సీపీ మద్దతుదారులైన లోకేశ్, భూలోక, సాయి, భాస్కర్, చిన్ని, ఆశ అనే వ్యక్తులు, మరికొందరితో కలసి ఈ నెల 15న రాత్రి మద్యం తాగి కొట్టు దగ్గరికి వచ్చారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రాంతంలో ఉండి ఎన్డీయే అభ్యర్థికి ఓటెలా వేస్తారని లోకేశ్‌ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ, బూతులు తిట్టారని తెలిపారు. అనంతరం తమని తలలు పగిలి, రక్తం కారేలా కొట్టారని తన చెల్లి రమ్యను గర్భిణి అని చూడకుండా కడుపుపై తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు మణికంఠను కొందరు ఎత్తుకెళ్లి మేకులున్న కర్రతో నుదురు, తల మీద దారుణంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

'కేసు పెట్టకూడదంటే 2 లక్షలు ఇవ్వాలి'- బాధితులకు పోలీసుల ఆఫర్​ - YSRCP Leaders Attack on Family

ఏమడిగారో కూడా తెలియదు : ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 16వ తేదీ తెల్లవారుజామున పోలీసులు వచ్చారని ఫిర్యాదులో తెలిపారు. తాము భయాందోళనలతో వణికిపోతూ, పూర్తిగా తెలివిలో లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏవో ప్రశ్నలు అడిగారని అన్నారు. తన తల్లి తల పగిలిన గాయానికి 24 కుట్లు, తమ్ముడికి 14 కుట్లు, తనకు ఆరు కుట్లు వేశారని పోలీసులు ఏమడిగారో కూడా తెలియని అలాంటి పరిస్థితుల్లో సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు.

విశాఖలో మీడియాపై కేసులు- 'బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకే' - Police Cases against media

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.