ETV Bharat / state

ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీకి ఊడిగం - ఏపీఎండీసీలో ఉద్యోగులుగా అధికార పార్టీ నేతలు - YSRCP Leaders as APMDC Employees - YSRCP LEADERS AS APMDC EMPLOYEES

YSRCP Leaders as APMDC Employees: ఐదేళ్లలో ఆంధ్రావనిని అయోమయంగా అర్థంపర్థంలేని విధంగా ఏలిన జగన్‌ సర్కారు, పొరుగు సేవల ఉద్యోగానికి ఏ నిఘంటువులో లేని కొత్త నిర్వచనం ఇస్తోంది. జీతం సర్కారులో తీసుకొని పని మాత్రం సొంతింట్లో చేయిస్తోంది. దీనినే పొరుగు సేవలంటోంది. లక్షల మంది యువత ఐదేళ్లుగా కొలువుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే, అనర్హులకు, అస్మదీయులకు సిఫార్సులపై నిస్సిగ్గుగా, నిర్లజ్జగా సర్కారు కొలువులిచ్చి వైసీపీలో పనిచేయించుకుంటోంది.

YSRCP_Leaders_As_APMDC_Employees
YSRCP_Leaders_As_APMDC_Employees
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 8:50 AM IST

ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీకి ఊడిగం - ఏపీఎండీసీలో ఉద్యోగులుగా అధికార పార్టీ నేతలు

YSRCP Leaders as APMDC Employees: సిద్ధం పోస్టర్‌లో కనిపిస్తోన్న ఇతని పేరు యారా సాయిప్రశాంత్‌. ఇతను వైసీపీ నేత కాదు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ - ఏపీఎండీసీలో (Andhra Pradesh Mineral Development Corporation) అసిస్టెంట్‌ మేనేజర్‌. జీతం 30 వేలు, అదనపు భత్యం 30 వేలు, హెచ్‌ఆర్‌ఏతో కలిపి ప్రతినెలా 70 వేలు తీసుకుంటున్నారు. ఇంత జీతమిచ్చి, అసిస్టెంట్‌ మేనేజర్‌గా తీసుకున్నారంటే ఆయన ఏంబీయేనో, పీజీనో చేసుంటానుకుంటే పొరపాటే. పాయిప్రశాంత్‌ చదివింది ఇంటరే. పోనీ నిత్యం విధులకైనా హాజరవుతాడా అంటే సంస్థ ప్రధాన కార్యాలయంలో అతన్ని చూసిన వారే లేరు. ఎప్పుడూ సీఎంవోలోనో, వైసీపీ రాష్ట్ర కార్యాలయంలోనో ఉంటూ పార్టీ ప్రచారానికి సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంటాడు. అయినా సరే ఏపీఎండీసీ 2020 మే నెల నుంచి అతన్ని పొరుగు సేవల ఉద్యోగిగా చూపుతూ జీతం ఇస్తోంది.

ఈ ఫొటోలో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎర్రచందనం స్మగ్లర్‌ విజయానందరెడ్డితో పాటు ఉన్న వ్యక్తి పేరు పి.హేమంత్‌కుమార్‌రెడ్డి. చిత్తూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు. కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి పార్టీ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాడు. ఇతనూ ఏపీఎండీసీలో కాంట్రాక్టు విధానంలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. ఏ రోజూ ఏపీఎండీసీ కార్యాలయంలో విధులకు హాజరైన దాఖలాల్లేవు. కానీ నాలుగైదు సంవత్సరాలుగా నెలకు 70 వేల జీతం పొందుతున్నాడు.

APMDC: జోరుగా ముగ్గురాయి అక్రమ రవాణా.. సిబ్బంది మధ్య విభేదాలతో వెలుగులోకి

మంత్రి, ఎంపీ సిఫార్సుతో 400 మందికి ఉద్యోగాలు: సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డిలకు చెందిన తిరుపతి ఆఫీసులో బీఆర్‌ తేజేష్‌రెడ్డి పనిచేస్తున్నాడు. అతను ఏపీఎండీసీలో కాంట్రాక్టు విధానంలో నాలుగైదు సంవత్సరాల కిందట మేనేజర్‌గా నియమితుడయ్యాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తిరుపతిలో మంత్రి, ఎంపీలకు సంబంధించి వ్యవహారాలను చూడటమే ఆయన విధి. ఏపీఎండీసీకి పనిచేసిన దాఖలాల్లేవు. అయినా సరే ఏపీఎండీసీ నుంచి ప్రతినెలా 70 వేల వరకు జీతం తేజేష్‌రెడ్డికి అందుతోంది.

వీళ్లే కాదు ఏపీఎండీసీలోకి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల సిఫార్సుతో 400 మంది కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులుగా అడుగుపెట్టారు! వీరిలో 200 మంది విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నారు. చాలామందికి ఎలాంటి పనీ ఉండదు. దాంతో ఒకరు చేయాల్సిన పనిని ముగ్గురు, నలుగురు పంచుకొని ఏదో చేస్తున్నట్లు చూపేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు అసలు కార్యాలయానికే రారు. మంత్రి, ఎంపీల సిఫార్సుతో చేరిన ఉద్యోగుల్లో 80 శాతం ఉమ్మడి చిత్తూరు జిల్లా వారే. కడప ఎంపీ సిఫార్సుతో మరో 10 శాతం మంది వైఎస్సార్ జిల్లా వారు వచ్చారు. మిగిలిన 10 శాతమే ఇతర జిల్లాలకు చెందిన వారు.

ఏపీఎండీసీకి అన్నమయ్య జిల్లా మంగంపేటలోని ముగ్గురాయి గనుల ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుంది. ఈ గనుల కోసం భూములు కోల్పోయిన వారికి సమీప గ్రామాల్లోని అర్హులకే ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఈ ప్రాంతంతో సంబంధంలేని ఉమ్మడి చిత్తూరు జిల్లా వారికి అత్యధికంగా అవకాశమిచ్చారు. ఇదేమిటని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఇలా సిఫార్సుల ఆధారంగా పోస్టింగ్​లు ఎన్నికల కోడ్‌ వచ్చే రోజు వరకు మాత్రమే కొనసాగాయి. కాంట్రాక్టు విధానంలో ఈనెల 14, 15 తేదీల్లో కూడా 8 మందిని మంగంపేట గనుల్లోకి, ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయంలోకి తీసుకున్నారు.

JP Company Not Paid Sand Arrears to APMDC: జేపీ సంస్థపై వైసీపీ సర్కారు ప్రేమ.. రూ.120 కోట్ల బకాయిపై నోరెత్తని వైనం

ఇంటర్‌ విద్యార్హతకు భారీగా జీతం: ఏదైనా సంస్థలోకి ఉద్యోగులను తీసుకున్నప్పుడు వారి విద్యార్హత, చేసే పని స్థాయి, అనుభవాన్ని బట్టి జీతం నిర్ణయిస్తారు. ఏపీఎండీసీలో మాత్రం సిఫార్సు చేసిన నేత స్థాయికి అనుగుణంగా ఉద్యోగికి జీతభత్యాలు ఖరారు చేశారు. ఇంటర్‌ అర్హతతో కొందరిని ఆఫీస్‌ సబార్డినేట్లుగా, అటెండర్లుగా తీసుకున్నారు. యారా సాయిప్రశాంత్‌ లాంటి వారికి విద్యార్హత ఇంటర్‌ మాత్రమే అయినప్పటికీ ఏకంగా అసిస్టెంట్‌ మేనేజర్‌గా పోస్టును కట్టబెట్టి 70 వేల వరకు జీతం ఇస్తుండటం విస్తుగొలుపుతోంది.

నాలుగున్నరేళ్లుగా గనుల శాఖకు ఇన్‌ఛార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు. మధ్యలో కొంతకాలం ఏపీఎండీసీ ఛైర్మన్‌ హోదాలోనూ కొనసాగారు. ఏపీఎండీసీకి ఇన్‌ఛార్జి ఎండీగా గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు. సంస్థలో ఉద్యోగులుగా నమోదై వైసీపీ సేవలో తరిస్తున్న వారి తీరుపై ఈ ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, కీలక మంత్రి ఏది చెబితే దానికి తలూపుతూ ఏపీఎండీసీ సంస్థకు ఆర్థికంగా నష్టం కలిగేలా ఈ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు ఆ ఉద్యోగులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు. ఎంతకాలం నుంచి, ఏ హోదాలో, ఏం చేస్తున్నారు. ఉద్యోగానికి రాకున్నా విధులకు రాకున్నా హాజరైనట్లు ఎలా నమోదు అవుతోందనే అనే ప్రశ్నలకు సమాధానాలు జగనెరిగిన, జగమెరిగిన సత్యాలేనని విమర్శలు వ్యక్తమవుతున్నా అధికారులు మాత్రం పటించుకోవడం లేదు.

ఏపీఎండీసీ నిధులపై జగన్ సర్కార్​ కన్ను - 700 కోట్లు పక్కదారి పట్టించేందుకు సన్నద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.