ETV Bharat / state

ఎంపీడీవోపై దాడి - విడదల రజిని ముఖ్య అనుచరుడు అరెస్ట్​ - YSRCP LEADER SINGAREDDY ARREST

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కోటిరెడ్డి - విచారణకు వచ్చిన ఎంపీడీవోను దూషించిన వైనం

ysrcp_leader_singareddy_kotireddy_arrested_due_to_mpdo_issue
ysrcp_leader_singareddy_kotireddy_arrested_due_to_mpdo_issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 11:28 AM IST

YSRCP Leader Singareddy Kotireddy Arrested due to MPDO Issue at Palnadu District : మాజీ మంత్రి విడదల రజిని ముఖ్య అనుచరుడు, వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డిని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు అరెస్టు చేశారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కోటిరెడ్డి మరొకరికి దీన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించాడని, వాణిజ్య దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చారని గ్రామస్థులు ప్రజా వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించేందుకు రెండ్రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ఎంపీడీవో స్వరూపరాణిని, ఫిర్యాదుదారు, టీడీపీ స్థానిక నేత భవనం శ్రీనివాసరెడ్డిని కోటిరెడ్డి దుర్భాషలాడి దౌర్జన్యంగా వ్యవహరించాడు.

విధులను అడ్డుకుని తనను కోటిరెడ్డి కులం పేరుతో అసభ్యంగా దూషించి కొట్టాడని ఎంపీడీవో నాదెండ్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఏజేసీజే న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరచగా జడ్జి నిందితుడికి రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.