ETV Bharat / state

వైసీపీకి వరుస షాక్​లు - ఓ వైపు రాజీనామాల పర్వం, మరోవైపు అసమ్మతి సెగలు - YSRCP Leader Resigned - YSRCP LEADER RESIGNED

YSRCP Leader Resigned to Party: ఎన్నికలు సందడి ప్రారంభమైన దగ్గర్నుంచి అధికార వైసీపీలో అలజడి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు ఏదో ఓ నేత రాజీనామా చేయడం లేదా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఎంపీలే రాజీనామాలు చేస్తున్నారు. ఇక కింది స్థాయిలో ఈ పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. నేడు మరికొందరు నేతలు అధికార వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

YSRCP_Leader_Resigned_to_Party
YSRCP_Leader_Resigned_to_Party
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 9:41 PM IST

Updated : Mar 29, 2024, 9:58 PM IST

YSRCP Leader Resigned to Party: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండ‌లం కొత్త‌ప‌ల్లె స‌ర్పంచ్ కొనిరెడ్డి శివ‌చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా ప‌త్రాన్ని క‌డ‌ప‌లో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు సురేష్‌బాబుకు అంద‌జేశారు. కొనిరెడ్డి శివ‌చంద్రారెడ్డి గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్​ రెడ్డికి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు అవినీతి, అరాచ‌కాలు పెరిగిపోయాయాని ఆ విషయాన్ని అనేక సార్లు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం లేద‌ని రాజీనామ ప‌త్రంలో పేర్కొన్నారు.

అవినీతి ప‌రుల‌ను అంద‌లం ఎక్కిస్తుంటే పార్టీలో మ‌నుగ‌డ సాధించ‌లేక వైసీపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు తెలిపారు. కొత్త‌ప‌ల్లె పంచాయ‌తీ ప‌రిధిలోని 13 మంది వార్డు స‌భ్యుల‌ను 8 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు కొన్నార‌ని ఆరోపించారు. పంచాయతీని అభివృద్ధి చేయ‌కుండా ఎమ్మెల్యే అడ్డుకున్నార‌ని శివ‌చంద్రారెడ్డి తెలిపారు.

చిలకలూరిపేటలో వైసీపీ ఖాళీ - మాజీ ఇన్‌ఛార్జితో పాటు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ సహా కౌన్సిలర్లు టీడీపీలో చేరిక - YCP WIPED OUT IN CHILAKALURIPETA

టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ ప్రసాద్ రెడ్డి అస‌మ్మ‌తి నేత కొత్త‌పల్లె స‌ర్పంచ్ శివ‌చంద్రారెడ్డిని టీడీపీకి ఎమ్మెల్యే అభ్య‌ర్థి నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి క‌లిశారు. కాన‌పల్లెలోని ఆయ‌న నివాసానికి చేరుకుని టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. శనివారం ప్రొద్దుటూరులో జ‌ర‌గ‌నున్న చంద్ర‌బాబు ప్ర‌జాగ‌ళం స‌భ‌లో కొనిరెడ్డి శివ‌చంద్రారెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి టీడీపీలో చేరనున్నారు. స‌ర్పంచ్ శివ చంద్రారెడ్డి కొన్ని రోజుల నుంచి వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్​ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేకి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్నారు. రాచ‌మ‌ల్లుకు ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌డాన్ని కొనిరెడ్డి శివ‌చంద్రారెడ్డి వ్య‌తిరేకించారు. ఈ నేప‌థ్యంలో శివ‌చంద్రారెడ్డిని వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎమ్మెల్యే అరాచ‌క‌రాలు భ‌రించ‌లేకే: వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్​ రెడ్డి అరాచ‌క‌రాలు భ‌రించ‌లేకే వైసీపీను వీడి టీడీపీలో చేరుతున్న‌ట్లు కొత్త‌ప‌ల్లి స‌ర్పంచ్ కొనిరెడ్డి శివ‌చంద్రారెడ్డి వాఖ్యానించారు. ప్రొద్దుటూరులో జ‌రిగే ప్ర‌జాగ‌ళం స‌భ‌లో చంద్ర‌బాబు స‌మ‌క్షంలో పార్టీలో చేతున్న‌ట్లు తెలిపారు. తాను డ‌బ్బుకు అమ్ముడు పోయాన‌ని వైసీపీ నేత‌లు ఆరోపించ‌డంపై శివ‌చంద్రారెడ్డి మండిప‌డ్డారు. ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు త‌న‌ను ఎన్నో ర‌కాలుగా ఇబ్బందులకు గురిచేశార‌ని ఆరోపించారు. కొత్త‌పల్లె పంచాయ‌తి ప‌రిధిలో జ‌రిగిన ప‌నుల్లో ఎమ్మెల్యే త‌న వ‌ద్ద నుంచి క‌మీష‌న్ తీసున్నార‌ని శివ‌చంద్రారెడ్డి తెలిపారు.

"ఇదీ YSRCP దుస్థితి" - భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్లొద్దూ అంటూ వేడుకోలు - MP Vijayasaireddy Election Campaign

రాప్తాడు నియోజకవర్గం రగులుతోన్న అసమ్మతి: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి రోజు రోజుకి రగులుతోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నమ్మి ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మోసం చేశారన్నారు. తమ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కష్టపడిన వారికి గుర్తింపు లేకుండా చేశారని మండిపడ్డారు.

నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డిపై అసంతృప్తి ఉన్నా మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకే కేటాయించడం పట్ల నియోజకవర్గంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని గుర్తించుకొని టికెట్ ను బీసీ వర్గానికి చెందిన వ్యక్తులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ అవకాశమిస్తే కలుస్తామని లేని పక్షంలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకతను చాటుతామని హెచ్చరించారు.

వైసీపీకి బిగ్​ షాక్ - బీజేపీలో చేరిన ఎమ్మెల్యే వరప్రసాద్‌ - Gudur MLA Varaprasad Joined in BJP

Last Updated : Mar 29, 2024, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.