YSRCP illegal offices at Yendada Jana Sena corporator urges GVMC officials : విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం కోసం చినగదిలి మండలం ఎండాడలోని సర్వే నెంబరు 175/4లో రెండెకరాల స్థలాన్ని 2022 మే నెలలో వైఎస్సార్సీపీ సర్కార్ కేటాయించింది. ఎకరా 60కోట్ల రూపాయల విలువజేసే స్థలాన్ని కేవలం ఏడాదికి వెయ్యిరూపాయల అద్దె చెల్లించేలా 33 ఏళ్లపాటు లీజుకు రాయించేసుకున్న వైఎస్సార్సీపీ ఆగమేఘాలపై నిర్మాణాలు చేపట్టింది. అధికారం అండతో అనుమతులు తీసుకోకుండానే కట్టడాలు పూర్తి చేసింది. సాధారణంగా జీవీఎంసీ (GVMC) నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. కానీ, కలెక్టర్ మల్లికార్జున ఛైర్మన్‌గా ఉన్న వీఎంఆర్డీఏ (VMRDA) కు 10వేల రూపాయలు చెల్లించారు. దరఖాస్తు చేసి వదిలేశారు. గడిచిన 525 రోజులుగా మాస్టర్ ప్లాన్ అనుమతులు రాకపోవడంతో దరఖాస్తు లాగిన్ దశలోనే ఉంది. ఈనెల 20న మధురవాడ జోన్-2 సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయ భవనాల వద్దకు వెళ్లారు. ప్లాన్ ఉందా? లేదా? అని పరిశీలించారు.
వైసీపీ నేతలకు కాసులవర్షం - యథేచ్ఛగా అక్రమ కట్టడాలు
ఐతే అక్కడున్న ఓ మహిళ ఎప్పుడో భవనం పూర్తైతే ఇప్పుడు ప్లాన్ ఏంటి అని ప్రశ్నించింది! ఏమున్నా ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడుకోండి' అంటూ సమాధానమిచ్చింది. అప్పటికి వెంకట సుబ్రమణ్యం అనే అధికారి వద్ద సంబంధిత దస్త్రం పెండింగ్‌లో ఉంది. ఇక ఈనెల 20న సాయంత్రం జిల్లా అధికారుల సలహాతో వైఎస్సార్సీపీ నేతలు ఆగమేఘాలపై కదిలారు. వైఎస్సార్సీపీ నేతలు సుమారు 14లక్షలు చెల్లించారు. ఆ వెంటనే రాత్రి 7 గంటల 27 నిమిషాలకు VMRDA టౌన్ ప్లానింగ్‌లోని సతీష్ అనే ఉద్యోగి లాగిన్‌కు దస్త్రం చేసింది. ఆ తర్వాత మూడే మూడు నిమిషాలలకు రామానాయుడు అనే ఉద్యోగికి, మరో 19నిమిషాల్లో పై అధికారి లాగిన్‌కు చేరింది. ఇంకాసేపు ఆగితే అనమతులకు కావాల్సిన మిగతా తంతు అంతా పూర్తయ్యేది. ఈ లోపే జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్‌లోని అధికారులు దస్త్రాన్ని నిలిపివేశారు. ఇలా ఎప్పుడో పూర్తైన భవనానికి అధికారులు ఇప్పుడు అనుమతులు ఇస్తూ వైఎస్సార్సీపీపై భక్తి చాటుకునే ప్రయత్నం చేశారు.
రుషికొండ నిర్మాణాలపై హైకోర్టుకు నిపుణుల కమిటీ నివేదిక - తదుపరి విచారణ వాయిదా
YSRCP Office Being Constructed Illegally : ఇక అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం కూడా అనుమతుల్లేకుండానే నిర్మించేశారు. రాజుపాలెం సర్వే నెంబరు 75/3లో గతంలో కాపు కార్పొరేషన్‌కు 1.75 ఎకరాల స్థలం కేటాయించి దాని చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారు. ప్రజా అవసరారలకు ఉపయోగన పడాల్సిన ఆ స్థలాన్ని 2022లో వైఎస్సార్సీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్నారు. ఇ్కకడ భవన నిర్మాణాల అనుమతుల కోసం వైఎస్సార్సీపీ నేతలు పట్టణ ప్రణాళిక అధికారులకు దరఖాస్తు చేసి 351 రోజులవుతోంది. ఐనా అనుమతులు రాలేదు. దీనికి జీవీఎంసీ, వీఎంఆర్డీఏ నిధులతో రోడ్లు, విద్యుత్ లైట్లు కూడా జగన్ జమానాలో ఏర్పాటు చేశారు.