ETV Bharat / state

పేదల సొమ్ము పెద్దలకు- కాంట్రాక్టర్లకు సంక్షేమ పథకాల నిధుల చెల్లింపులు - CONTRACTORS payments - CONTRACTORS PAYMENTS

YSRCP Govt Schemes Payment Misuse to Pay Followers Bills : రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్​ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. నామమాత్రంగా రెండు సంక్షేమ పథకాలకే నిధులను జమ చేశారు. మరో వైపు ఉన్న నిధుల్లో అధికార పార్టీ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి

dbt_funds
dbt_funds (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 8:05 AM IST

YSRCP Govt Schemes Payment Misuse to Pay Followers Bills : పోలింగ్‌కు ముందు పేదలకు పథకాల సొమ్ము జమ చేసేందుకు హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు సొంత గుత్తేదారులకే పంచిపెడుతోంది. రెండు రోజుల్లోనే రూ. 4 వేల కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేయగా వాటిలో రెండు సంక్షేమ పథకాలకు మాత్రమే నామమాత్రంగా జమ చేశారు. గుత్తేదారులకు చెల్లింపుల్లో ఫిఫో విధానం పాటించకుండా నచ్చిన వారికి ఇచ్చుకుంటూ పోతున్నారు. మరో రూ. 2 వేల కోట్ల అప్పులు తెచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పోలింగ్‌ ముగిసి అయిదు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరోవైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. క్విడ్​ప్రోకో విధానాలకు అలవాటుపడ్డ అధికారులు పోలింగ్​ తర్వాత కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. గత బుధ, గురువారాల్లో ప్రభుత్వం ఖజానా నుంచి దాదాపు రూ. 4,000 కోట్ల మేర చెల్లింపులు చేసింది. ఇందులో రూ. 1480 కోట్ల ఆసరా సొమ్ములు, రూ.502 కోట్ల విద్యాదీవెన సొమ్ములు మాత్రమే లబ్ధిదారులకు చెల్లించారు. ఎప్పుడో బటన్‌ నొక్కిన ఈ పథకాలకు తాజాగా చెల్లింపులయ్యాయి.

పథకాల నిధులు నిలుపుదల - జగన్​ సర్కార్​ కాంట్రాక్టర్లకు చెల్లింపులు ? - DBT SCHEME FUNDS TO CONTRACTORS

ఇదే సమయంలో 2 వేల కోట్ల వరకు అనుయాయులకు చెల్లించేశారు. పోలింగ్‌కు ముందు రోజు మొత్తం రూ.14,165 కోట్లు పేదలకు చెల్లించాలంటూ నానా హంగామా చేసిన సీఎస్​ జవహర్‌రెడ్డి ప్రస్తుతం ఆ చెల్లింపులపై పెద్దగా దృష్టి పెట్టలేదనేందుకు తాజా పరిణామాలు నిదర్శనంగా నిలిచాయి. ఆసరా, విద్యాదీవెన పథకాలకు మరికొంత సొమ్ము ఇంతకు ముందే చెల్లించినట్లు సమాచారం. ఇవి కాకుండా వైఎస్సార్‌ చేయూత, ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా, రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ములు జమ చేయాల్సి ఉంది.

శుక్రవారం నాటి పరిస్థితుల ప్రకారం ప్రస్తుతం చేతిలో రూ. 200 కోట్ల నగదు ఉన్నట్లు సమాచారం. అంటే వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద తీసుకున్న చెల్లింపులు కూడా రిజర్వు బ్యాంకుకు పూర్తి చేసినట్లే. మరోవైపు వచ్చే మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఈ రూపేణా రూ.2,000 కోట్లు తీసుకురానున్నారు. ఆ నిధులు బుధవారం ఖజానాకు చేరుతాయి. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చే నిధులూ కలిపి చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరో రూ. 4 వేల కోట్ల రుణం కోసం ఆర్‌బీఐ తలుపు తట్టిన వైఎస్సార్సీపీ - సొంతవారికి బిల్లుల చెల్లింపు కోసమేనా! - YSRCP Took Loans To Pay Bills

పథకాలకు అంతంతమాత్రంగా చెల్లిస్తున్న అధికారులు మరో వైపు అనుయాయ గుత్తేదారులకు మాత్రం బిల్లులను చెల్లిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈ ఆర్థిక సంవత్సరానికీ బదిలీ చేస్తూ బడ్జెట్‌ సమయంలోనే నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) బడ్జెట్‌ ఆమోదం పొందాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడింది. ఎన్నికల తర్వాత కూడా అనుయాయులకు బిల్లులిచ్చే క్రమంలోనే అప్పట్లో బడ్జెట్‌ విడుదల మార్గదర్శకాల్లో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు.

పోలింగ్‌ పూర్తయ్యాక తమ వారికే బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యమిస్తున్నారు. మరో వైపు అనేక మంది గుత్తేదారులు, సరఫరాదారులు ఈ చివరి నిమిషంలోనూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం పాలనలో రాష్ట్ర ఉన్నతాధికారులదే కీలక పాత్ర. ఖజానా చెల్లింపుల్లో స్క్రీనింగు కమిటీ నిర్ణయాలే ముఖ్యం. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు అప్పటి ఉన్నతాధికారులు ఫిఫో విధానం పక్కాగా పాటించారు. తొలుత వచ్చిన బిల్లును తొలుత చెల్లించాలనే ఈ విధానాన్ని అనుసరిస్తే ఎవరి నుంచీ విమర్శలు ఉండవు. ఇందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఫిఫోను విస్మరించి పెద్దల మాటలకే పెద్ద పీట వేస్తున్నారు.

ప్రభుత్వ పథకాల నిధులు లబ్ధి దారుల ఖాతాల్లో చేరలేదు : సీఎఫ్​డీ వల్లంరెడ్డి - CFD Vallamreddy Lakshmana Reddy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.