YSRCP Government Not Giving Them Houses in Poor People: విజయవాడలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ముప్పతిప్పులు పెడుతోంది. వరద ముప్పు నుంచి విముక్తి కల్పించేందుకు రక్షణ గోడను ఏర్పాటు చేసిన అధికారులు ఇళ్లు కోల్పోయిన వారికి పట్టాలు మంజూరు చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను, కరెంట్ బిల్లు చెల్లిస్తున్నా తాము ఉంటున్న ఇళ్లకు మాత్రం అధికారులు పట్టాలు పంపిణీ చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్యాయంగా పేదల ఇళ్లు కూల్చారు: పులివర్తి సుధారెడ్డి
విజయవాడ కృష్ణా నది పరివాహక ప్రాంతాలుగా ఉన్న రామలింగేశ్వర నగర్లోని కొన్ని ప్రాంతాలైన భూపేశ్ గుప్తా నగర్, తారకరామానగర్, రణదివే నగర్, గాంధీ కాలనీ తదితర చోట్ల 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయడంలో పాలకులు విఫలమయ్యారు. కృష్ణా నదికి వరద వచ్చినప్పుడల్లా పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు చాలా వరకు ముంపునకు గురయ్యేవి. ముంపు బారి నుంచి తప్పించేందుకు రక్షణ గోడని ప్రభుత్వం నిర్మించింది. ఇంత వరకు బాగానే ఉన్నా స్థానికులకు ఇంటి పట్టాలు ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఎన్నికల ముందు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చిన నేతలు అధికారంలోకి వచ్చాక ఆ హామీలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పూరిగుడిసెల్లో జీవిస్తున్న తమపై పన్నుల మోత మోగిస్తున్న జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని వారంతా ప్రశ్నిస్తున్నారు.
టిడ్కో ఇళ్లలో మంచినీళ్లొద్దా? బిందెలతో మహిళల నిరసన
ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడం లేదని ప్రత్యామ్నాయ ప్రాంతాల్లోనూ నివాస స్థలాలను కేటాయించడం లేదని బాధితులు వాపోతున్నారు. మరోవైపు పూరి గుడిసెల్లో ఉంటున్నా పన్నుల మోత మాత్రం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పో సొప్పో చేసి ఇళ్లు నిర్మించుకుంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్(Vijayawada Municipal Corporation) సిబ్బంది వాటిని తొలగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కృష్ణా నది నుంచి రక్షణ కోసమే గోడ నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ పెద్దలు తాము నివాసమున్న ఇళ్లు ఖాళీ చేయమని చెప్పడం అన్యామని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న వారికి పట్టాలు మంజూరు చేయడంలో పాలకులు అలసత్వం ప్రదర్శించడం సరైంది కాదని ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.
పేదల ఇళ్లపై పగబట్టిన జగన్ సర్కార్ - అయిదేళ్లుగా పూర్తి చేయని వైనం