ETV Bharat / state

ప్రజారోగ్య పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యం- వైఎస్సార్సీపీ పాలనలో అలంకారప్రాయంగా కమాండ్‌ సెంటర్‌ - SANITATION SITUATION IN AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 1:15 PM IST

Updated : May 30, 2024, 1:55 PM IST

City Sanitation Situation in AP: ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఇదే సూత్రాన్ని అమలు చేసేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ వైఎస్సార్సీపీ పాలనలో అస్తవ్యస్తంగా తయారైంది. ప్రాజెక్టు ఉద్దేశాన్ని పక్కన పెట్టి దీన్ని అలంకారప్రాయంగా మార్చేశారు. నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రతకు ఎంతో దోహదం చేసిన కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో పారిశుద్ధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రత్యేక కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణతో నిత్యం చెత్త పేరుకుపోయే బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి ఏడాదిన్నర వ్యవధిలోనే పరిశుభ్రమైన ప్రాంతాల జాబితాలో చేర్చిన గ్రీన్‌ స్పాట్‌లు మళ్లీ దుర్గందభరితంగా మారాయి.

City Sanitation Situation in AP
City Sanitation Situation in AP (ETV Bharat)
ప్రజారోగ్య పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యం- వైఎస్సార్సీపీ పాలనలో అలంకారప్రాయంగా కమాండ్‌ సెంటర్‌ (ETV Bharat)

City Sanitation Situation in AP : పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని గుర్తించిన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సచివాలయంలోని రెండో బ్లాకులో కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ను ప్రారంభించింది. అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఇందులో భాగస్వాములను చేసింది. 2017లో సెంటర్‌ ఏర్పాటయ్యాక సాంకేతిక సిబ్బందితో నగరాలు, పట్టణాల్లో సర్వే చేయించి నిత్యం చెత్త పేరుకుపోయే 21 వేల ప్రాంతాలను గుర్తించి ఫొటోలు తీయించారు. వీటిని బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించి సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్, సూపర్‌వైజర్‌ వివరాలతో మ్యాపింగ్‌ చేశారు. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులతో రోజూ శుభ్రం చేయించే బాధ్యతను వారికి అప్పగించి కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రోజూ దాదాపు 60 మంది సాంకేతిక సిబ్బంది సెంటర్‌లో సేవలు అందించేవారు. మంచి ఫలితాలు వస్తున్న దశలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పక్కన పెట్టి నిర్వీర్యం చేసింది.

ధవళేశ్వరంలో పడకేసిన పారిశుద్ధ్యం - ఈగలు, దోమలతో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు - Disorganized sanitation in ap

Sanitation Problems in Andhra Pradesh : కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ రూపురేఖలు మార్చేసిన ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజల సమస్యలపై వచ్చే ఫిర్యాదులను జగనన్నకు చెబుదాం కార్యక్రమానికే పరిమితం చేసింది. ఆన్‌లైన్‌లో నమోదైన సమస్యలు, సేవలకు సంబంధించి నిర్దేశించిన గడువులోగా పరిష్కారమయ్యాయా? సేవలు అందించారా? లేదా అనే దానిపై ఇక్కడ నుంచి సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. జాప్యమైతే సంబంధిత పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లకు సమాచారం పంపుతారు. కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌లో బ్లాక్‌ స్పాట్‌ల పర్యవేక్షణకు గతంలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ స్క్రీన్లను పక్కన పెట్టేశారు. సిబ్బంది సంఖ్యను తగ్గించారు.

గతంలో పట్టణ స్థానిక సంస్థల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉన్న 21 వేల బ్లాక్‌ స్పాట్‌లలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 8గంటల 30 నిమిషాల్లోపు సిబ్బందితో సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్, సూపర్‌వైజర్‌ శుభ్రం చేయించేవారు. శుభ్రం చేసిన ప్రాంతాల చిత్రాలను 4 దశల్లో తీయించి ఇందుకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూపులో అప్‌లోడ్‌ చేసేవారు. వీటిని సచివాలయంలోని కమ్యూనికేషన్‌ సెంటర్‌ సాంకేతిక సిబ్బంది ఆడిట్‌ చేస్తుండేవారు.

చినుకు పడితే చిగురుటాకులా వణుకుతున్న బెజవాడ- లోతట్టు ప్రాంతాలు జలమయం - SANITATION PROBLEM

బ్లాక్‌ స్పాట్‌ల ఫోటోలు తీసి జియో ట్యాగింగ్‌ చేసినందున అదే ప్రాంతాల్లో కాకుండా శుభ్రంగా ఉన్న మరో ప్రాంతాల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రయత్నించినా అది సాధ్యమయ్యేది కాదు. బ్లాక్‌ స్పాట్‌లలో వరుసగా 90 రోజుల పాటు శుభ్రం చేసినట్లుగా సాంకేతిక సిబ్బంది ఆడిట్‌లో వెల్లడైతే వాటిని బ్లాక్‌ నుంచి గ్రీన్‌ స్పాట్‌లుగా మార్చేవారు. గ్రీన్‌స్పాట్‌లుగా మార్చాక కూడా 90 నుంచి 180 రోజులపాటు మళ్లీ నిరంతరాయంగా ఆ ప్రాంతాల్లో శుభ్రం చేసిన తరవాత సాధారణ ప్రాంతాలుగా గుర్తించేవారు. 21 వేల బ్లాక్‌ స్పాట్‌లను 90 రోజులపాటు నిరంతరంగా శుభ్రం చేయించి ఏడాదిన్నర వ్యవధిలో 5 వేల గ్రీన్‌ స్పాట్‌లుగా మార్చారు.

నగరాలలోని ప్రధాన కూడళ్లలో, రోడ్ల పక్కన ఎవరైనా చెత్త వేసినా వెంటనే సంబంధిత నగరపాలక సంస్థ అధికారులను అప్రమత్తం చేసేలా రాష్ట్ర సచివాలయంలోని కమ్యూనికేషన్‌ సెంటర్‌ పని చేసేది. అధికారులు వెంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపి చెత్తను తొలగించేవారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, రాజమహేంద్రవరం తదితర నగరాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలోని కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్లను సచివాలయంలోని సెంటర్‌కు అనుసంధానించడంతో సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించేవారు.

విజయవాడ నగరవాసులపై దోమల దండయాత్ర - రోగాలబారిన పడుతున్న ప్రజలు - Mosquitoes in Vijayawada

Last Updated : May 30, 2024, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.