ETV Bharat / state

అస్తవ్యస్తంగా సాగర్‌ కాలువలు - ఎక్కడికక్కడ దెబ్బతిన్న తూములు, షట్టర్లు - IRRIGATION CANALS SITUATION IN AP - IRRIGATION CANALS SITUATION IN AP

YSRCP Government Neglected Irrigation Canals in Prakasam District : వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రకాశం జిల్లాలో సాగర్‌ కాలువలు పరిస్థితి దారుణంగా మారింది. కాలువలపై ఉన్న మొక్కలను తొలగించకపోవడంతో ఇప్పుడవి చెట్లుగా ఎదిగి గట్లను దెబ్బతీస్తున్నాయి. లాకులు, షట్టర్లు కనీస మరమ్మతులకు నోచుకోక తుప్పుపట్టిపోయాయి. కూటమి ప్రభుత్వం కాలువలకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

sagar_canal_prakasam
sagar_canal_prakasam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 11:05 AM IST

YSRCP Government Neglected Irrigation Canals in Prakasam District : సాగర్‌ జలాలు ప్రకాశం జిల్లాలోని పలు మండలాల దాహార్తిని తీర్చుతాయి. అదే విధంగా వేలాది ఎకరాలు సాగుకు ఉపయోగపడతాయి. సాగర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే ఆ నీటిని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లలో నింపుతారు. ప్రకాశం జిల్లాలో పొదిలి, చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు మండలాల్లో గ్రామాలకు రామతీర్థం జలాశయం నుంచి నీటిని మళ్లిస్తారు. కుడి కాలువ ద్వారా పమిడిపాడు బ్రాంచ్‌ కెనాల్‌, దర్శి బ్రాంచ్‌ కెనాల్‌, ఒంగోలు బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా సాగు, తాగునీటికి నీటిని పంపిణీ చేస్తారు.

ఈ ఏడాది నాగార్జున సాగర్‌లో పుష్కలంగా నీటి నిల్వలు ఉండటంతో ఆరు తడి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. సాగుకు, వందల గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళిక వేసింది. అయితే నీరు ఇప్పుడు పొలాలు వరకూ చేరుతుందా లేదా అనే విషయంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ప్రధాన కాలువలు, బ్రాంచ్‌ కాలువలు, తూములు, షట్టర్లు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాలువలపై చెట్లు పెరిగి అడవులను తలపిస్తున్నాయి. గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలువల నిర్వహణను పట్టించుకున్న పాపాన పోలేదు. నీటి పారుదలకు ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు.

రైతులకు సంకటంగా అధికారుల అలసత్వం - Officers Neglect Repairing Drains

"ఈ రోజు నాగార్జున సాగర్​ డ్యాంలో నీళ్లు ఉన్నాయి. పంటలు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న కాలువలు చూస్తే బాధ కలుగుతోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాలువల్లో చెట్లు పెరిగి అస్తవ్యస్తంగా ఉన్నాయి. పంట పొలాలకు నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వమైనా కాలువలను బాగు చేయాలని కోరుకుంటున్నాం"- రైతులు, ప్రకాశం జిల్లా

జగన్​ సర్కార్​ నిర్లక్ష్యంతో కాలువలు పాయే, పంటల పోయో - YSRCP neglect maintenance of canals

క్వారీ తవ్వకాల కారణంగా కారుమంచి కాలువకు గండి పడి శిథిలమైంది. 130 క్యూసెక్కులు నీటికి బదులు ఇప్పుడు 30 క్యూసెక్కులు మాత్రమే విడుదల అవుతున్నాయి. షట్టర్లు తుప్పుపట్టి పోవడంతో అన్ని చోట్ల కాలువలకు లీకులే దర్శనమిస్తున్నాయి. రామతీర్థ రిజర్వాయర్‌లో కూడా గేట్లు తుప్పుపట్టాయి. నిర్వహణ సరిగ్గా లేక నీరు వృథాగా పోతోంది. ఫలితంగా సాగర్‌ నుంచి వచ్చే నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది.

సాగునీటి కాలువల నిర్వహణను గాలికొదిలేసిన జగన్ - ప్రశ్నార్థకంగా 2 లక్షల ఎకరాల పంట - Irrigation Canal situation in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.