YSRCP Government Neglected Irrigation Canals in Kakinada District : కాకినాడ జిల్లాలోని గోదావరి డెల్టా శివారు మండలమైన తాళ్లరేవులో సాగు నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. మండలంలోని పి.మల్లవరం పరిధిలోని గ్రాంటు ఆయకట్టుకు సాగు నీరు అందటం లేదు. 20 రోజులుగా పంట కాల్వల నుంచి చుక్క నీరు సరఫరా కావడం లేదు. నీటి సరఫరా నిలిచిపోవడంతో నాట్లు వేసిన వరి పొలాలు బీటలు తీశాయి.
తూతూ మంత్రంగా పూడికతీత పనులు : గ్రాంటు, పటవల, చొల్లంగి గ్రామాల్లోని సుమారు 800 ఎకరాలపైగా వరి దుబ్బలు ఎదుగుదల కోల్పోయాయి. కొన్నేళ్లుగా సార్వా, దాళ్వాల్లో సాగు నీటి ఇబ్బందులు ఈ ఆయకట్టు పరిధిలో రైతుల్ని వేధిస్తోంది. తాజాగా రోజుల తరబడి నీరు అందక పోవడంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అధికారులు వచ్చి పొలాల్ని పరిశీలించి వెళ్లడం తప్ప పంటకు పుష్కలంగా నీరు అందించలేదు. గ్రాంటు ఆయకట్టు పరిధిలో పంట కాల్వలు పూర్తిగా పూడికతో నిండి పోయాయి. పూడిక తీత పనులు శాశ్వతంగా చేపట్టలేదు. ఏటా తూతూ మంత్రంగా పూడిక తీయడంతో నీరు పొలాలకు చేరడం లేదు.
కాల్వల్లో నీరు లేక ఎండిపోతున్న వరి పొలాలు : ఖరీఫ్‌లో గోదావరి కాల్వ ద్వారా పుష్కలంగా నీరు సరఫరా చేస్తున్నా తాళ్లరేవు మండలంలోని శివారు ఆయకట్టు పొలాలకు మాత్రం చేరడం లేదు. మోటార్ల ద్వారా తడులు ఇద్దామన్నా కాల్వల్లోనూ నీరు లేక రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. ప్రధాన పంట కాల్వ ఎగువన పూడికతీత, మరమ్మతులు చేస్తున్నామని, పనులు పూర్తయిన తర్వాత నీరు ఇస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
పట్టిసీమకు గోదావరి పరవళ్లు - ఆనందంలో అన్నదాతలు - Pattiseema Lift Irrigation Project
నీరందక పంట మొత్తం ఎండిపోతుంది. అధికారులను అడిగితే అదిగో , ఇదిగో అంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు. పంట మొత్తం ఎండిపోయి పెట్టిన పెట్టుబడి నష్టపోయి ఉన్నాం - రైతులు, తాళ్లరేవు
రైతులకు సంకటంగా అధికారుల అలసత్వం - Officers Neglect Repairing Drains