Gandhi Hill at Vijayawada : కొండలు కొల్లగొట్టి విలాసాల కోసం భవనాలు నిర్మించిన జగన్ సర్కారు పర్యాటక ప్రాంతాలను మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. విజయవాడలోని గాంధీ పర్వతమే దీనికి నిదర్శనం. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్ది ఆదాయం సమకూర్చుకోవడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కొత్త ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
Illegal Activities At Historic Gandhi Hills Vijayawada : ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడిన గాంధీ పర్వతం ఇప్పుడు వెలవెలబోతోంది. విజయవాడలో అత్యంత రద్దీ కలిగిన పర్యాటక స్థలంగా వెలుగొందిన ఈ ప్రదేశం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. మహాత్మాగాంధీ స్థూపం వద్ద పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా భయానకంగా తయారైంది. పర్యాటకుల రాక తగ్గిపోయింది. అసాంఘిక కార్యకాలపాలకు అడ్డాగా మారింది.
'కొండపై ఉన్న నక్షత్రశాల విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే కేంద్రంగా ఉండేది. దీనిలోని నక్షత్ర మండలం, పాలపుంత, గ్రహాలు, ఉపగ్రహాల ఆకృతులు విపరీతంగా ఆకట్టుకునేవి. అయితే సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ఇది పర్యాటకులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు రైలు కూడా పాడవడంతో పర్యాటకుల రాక క్రమంగా తగ్గింది.' -సమీవుల్లా బేగ్, గాంధీ పర్వతం మేనేజర్
'పర్వతంపై ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలే దర్శనం కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచే నక్షత్రశాల అందుబాటులోకి తీసుకురాకపోవడం చాలా దారుణం. గత సంవత్సరం నవంబర్లో నిలిపి వేసిన చిన్నపిల్లల రైలు సౌకర్యం నేటికీ పునరుద్దరించలేదు. గాంధీ పర్వతం చుట్టూ రైలుపై తిరిగి చిన్నారులు ఎంతో సంతోషించేవారు. ప్రస్తుతం గాంధీ పర్వతంపై ఎక్కడిచూసిన విరిగిన కుర్చీలు, లైట్లు పిచ్చిమొక్కలతో అస్తవ్యస్తంగా మారింది. నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో ఆకతాయిలకు, మందుబాబులకు అడ్డాగా మారింది. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది.' -పర్యాటకులు
గతంలో టీడీపీ ప్రభుత్వం 5 కోట్లు వెచ్చించి గాంధీ పర్వతాన్ని అభివృద్ధి చేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీనికి మహర్దశ వస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
900 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రకోనేరు ఎండిపోయింది - అధికారుల నిర్లక్ష్యమే అంటున్న స్థానికులు - Gandikota Koneru Dried