YSRCP Government neglect krishna ghats in Vijayawada : 2016 కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో నిర్మించిన పుష్కర ఘాట్లు అధ్వానంగా తయారయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో ఘాట్లు ఉనికినే కోల్పోయే దుస్థితి నెలకొంది. నాడు ఘాట్లు నిర్మించిన తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో పూర్వవైభవంపై భక్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
కోట్ల రూపాయలతో నిర్మాణం : 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సందర్భంగా కోట్ల రూపాయల వ్యయంతో విజయవాడలో పుష్కర ఘాట్లు నిర్మించింది. కేవలం పుష్కరాల సమయంలోనే కాకుండా దుర్గమ్మ దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. వారిని దృష్టిలో ఉంచుకుని నదీ తీరం వెంట అనేక విశాల ఘాట్లు ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లూ అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ సర్కార్ వాటన్నింటినీ పాడుబెట్టింది. ఆర్టీసీ బస్టాండు వెనుక ఉన్న పద్మావతి, భవానీ ఘాట్లలో పిచ్చిమొక్కలు మొలిచినా కనీసం శుభ్రం చేయించిన పాపానపోలేదు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఘాట్లు : గతంలో విజయవాడ ప్రజలు సరదాగా కుటుంబంతో కలిసి ఘాట్లకు వెళ్లేవారు. గత ఐదేళ్లలో పాలకులు ఆ పరిస్థితి లేకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. ప్రైవేటు వ్యక్తులు ఘాట్ మెట్లను ఆక్రమించి వారికి అనువుగా నిర్మాణాలు చేపడుతున్నా మిన్నకున్నారు. అప్పటి మంత్రి వెల్లంపల్లి అరాచకాల ఫలితమే ఇదంతా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పెద్ద పండుగకు 'నర్మదా' నది సిద్ధం- పుష్కరాలు ఏడాది అంతా ఉంటాయా? - Narmada Pushkaralu 2024
కొత్త ప్రభుత్వంపైనే భక్తులు ఆశలు : గతంలో ఈ ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మను దర్శించుకునేవారు. ఇప్పుడు ఘాట్లవైపు చూడాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి! ఇళ్లలో వాడే నీరంతా పుష్కర కాల్వలో నుంచి కృష్ణా నదిలో కలుస్తోంది. కనకదుర్గ వారధి నుంచి యనమలకుదురు వరకూ నదీ పరిసరాలు ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహాల నుంచి వచ్చే మురుగు నీటితో కంపుకొడుతున్నాయి. మళ్లీ నాలుగేళ్లలో కృష్ణా పుష్కరాలు రానున్న వేళ ఇప్పటి నుంచే ఘాట్లు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అమ్మవారి దర్శించుకోవడానికి రాష్ట్రాల ప్రజలతో ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా వస్తారు. భక్తులంతా కృష్ణానదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఇప్పుడు కృష్ణనదిలో చుక్కనీరు కూడా లేదు. అప్పుడు భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవలని కోరుకుంటున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కృష్ణా నది ఘాట్లు.. అసౌకర్యానికి గురవుతున్న భక్తులు