ETV Bharat / state

బుడమేరు విస్తరణ పనులను అర్ధాంతరంగా ముగించిన జగన్ సర్కార్ - కోట్లు కొట్టేసిన నేతలు - YSRCP Govt on Budameru Expansion - YSRCP GOVT ON BUDAMERU EXPANSION

YSRCP Government Irregularities in Budameru Expansion: బుడమేరు విస్తరణ పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచేసింది. పనులను ప్రీక్లోజర్‌ పేరుతో అర్ధాంతరంగా రద్దు చేసింది. దీనిలో కొందరు ఆ పార్టీ నేతలు, అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు స్వాహా చేశారు. అసంపూర్తి పనులు, బుడమేరు పాయల మధ్యలో వైఎస్సార్సీపీ నేతల ఆక్రమణలే పొలాల మునకకు కారణమైందనే విమర్శలూ వస్తున్నాయి.

YSRCP Government Irregularities in Budameru Expansion
YSRCP Government Irregularities in Budameru Expansion (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 9:07 AM IST

YSRCP Government Irregularities in Budameru Expansion : బుడమేరు విస్తరణపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. గుడివాడ డ్రైనేజీ డివిజన్‌ పరిధిలో ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.60 కిలోమీటర్ల దూరం ఉంది. బుడమేరు పుట్టిన మైలవరం నుంచి ఎనికేపాడు వరకు 36 కిలోమీటర్లు జలవనరుల శాఖ ప్రత్యేక డివిజన్‌ పరిధిలో ఉంది.

డ్రైనేజీ డివిజన్‌లో 2011లో 5 ప్యాకేజీలుగా విభజించి 72 కోట్ల 50 లక్షలతో టెండర్లు పిలిచారు. 0 నుంచి 12 కిలోమీటర్ల వరకు 16 కోట్ల 15 లక్షలు, 12 నుంచి 25.60 కిలోమీటర్ల వరకు 17 కోట్లు, 25 నుంచి 34 కిలోమీటర్ల వరకు 12 కోట్లు, 34 నుంచి 43.50 కిలోమీటర్ల వరకు 13 కోట్లు, 42.50 నుంచి 50.60 కిలోమీటర్ల వరకు 14 కోట్లతో టెండర్లు పిలిచారు. 1, 4, 5 ప్యాకేజీలు రాఘవ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ, 2, 3 ప్యాకేజీలు ఆర్​ఎస్ఆర్ సంస్థ దక్కించుకున్నాయి.

పట్టించుకోని ప్రభుత్వం : టెండర్లు దక్కించుకున్న సంస్థలు భూసేకరణ చేపడితేనే పనులు చేస్తామంటూ జాప్యం చేశాయి. మొదటి ప్యాకేజీ విజయవాడ సమీపంలో ఉంది. జాతీయ రహదారి పక్కేనే ఉన్న దీని భూసేకరణకు 200 కోట్లు అవుతుందని ప్రభుత్వం పట్టించుకోలేదు. తొలుత 29.175 కిలోమీటర్ల వరకు 62 మీటర్ల బెడ్‌ విడ్త్‌తో వెడల్పు చేసి కట్టలు పటిష్ఠ పరచాలి. 29.825 కిలోమీటర్ల నుంచి 110 మీటర్ల వెడల్పు, తర్వాత 180 మీటర్ల వెడల్పు చేయాలి. ఈ డ్రెయిన్‌ని 417 క్యూమెక్కులు అంటే 15 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా డిజైన్‌ చేశారు.

సవాలుగా బుడమేరు గండి మరమ్మతు- పనులను పరిశీలించిన మంత్రి లోకేశ్​ - Ministers Lokesh Visit Budameru

విస్తరణ పనులు అటకెక్కించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్లాజ్‌ 60సీ పేరుతోనూ, అదనపు పనుల పేరుతో నాన్‌ ఈపీసీ కింద మొత్తం 28 కోట్ల 91 లక్షలు గుత్తేదారులకు దోచిపెట్టింది. అసలు పనులను ముందస్తు ముగింపు పేరుతో అర్ధాంతరంగా ఆపేసి, గుత్తేదారు సంస్థలకు బిల్లులు చేసింది. 2, 3, 5వ ప్యాకేజీల్లో పనులు మొత్తం పూర్తి చేశారు. ఎనికేపాడు నుంచి ఉన్న మొదటి ప్యాకేజీలో గుత్తేదారు సంస్థ కేవలం 30 శాతం పనులే పూర్తి చేసింది.

నాలుగో ప్యాకేజీ పనులను 2020లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసంపూర్తిగా ముగించింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు ఆ ప్యాకేజీల్లో కొంత పని దక్కించుకున్న నాస్‌బాబు సంస్థ చేపట్టిన 34 నుంచి 42.50 కిలోమీటర్ల వరకు 42.50 నుంచి 50.60 కిలోమీటర్ల వరకు ఉన్న పనులను ప్రీక్లోజర్‌ చేసేశారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనులు చేయకపోయినా గడువు పొడిగిస్తూ వచ్చారు. నిబంధనల ప్రకారం టెండర్లు ఒక సంస్థకు ఇచ్చినా క్లాజ్‌ 60సీ ద్వారా పనులు వేరే కాంట్రాక్టరకు అప్పగించొచ్చు.

2019లో వైఎస్సార్సీపీ పెద్దలు ఈ క్లాజ్‌ని బయటకు తీశారు. దీంతో ఇంజినీర్లు 1, 4, 5 ప్యాకేజీ పనులను వేరే గుత్తేదారులకు అప్పగించారు. ఈ గుత్తేదారులు పనులు అసంపూర్తిగా వదిలేసినా తవ్విన మట్టిని విక్రయించేసుకున్నా మొత్తం బిల్లులు చెల్లించేశారు. నిబంధనల ప్రకారం ప్రతి కిలోమీటరు పూర్తి చేస్తేనే బిల్లులు ఇవ్వాలి. కానీ వైఎస్సార్సీపీ పెద్దల సూచనతో వంద మీటర్ల మట్టి తవ్వినా బిల్లులు చేశారు. డ్రెయిన్‌ రెండు వైపులా తవ్వితేనే ఇవ్వాలి. కానీ ఒకవైపు తవ్వినా ఇచ్చేశారు. 2 వ ప్యాకేజీలో వంకరటింకరగా ఉందని 5 కిలోమీటర్ల దూరం, 3 వ ప్యాకేజీలో 2 కిలోమీటర్ల దూరం వ్యత్యాసం ఉందని అదనపు టెండర్లు పిలిచారు.

పట్టువదలని మంత్రి నిమ్మల - జోరువానలోనూ బుడమేరు గండి పనులు - Budameru repair work

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి గన్నవరం ప్రజాప్రతినిధి చక్రం తిప్పి నాన్‌ ఈసీసీ కింద గుత్తేదారులను సిండికేట్‌ చేయించి తమవారికి దక్కేలా చేశారు. 12 నుంచి 17.6 కిలోమీటర్ల దూరం వరకు మెలికలగా ఉందని, 8 కోట్లు అదనంగా కేటాయించి, ఓ గుత్తేదారుకు అప్పగించారు. గన్నవరం సమీపంలో ఈ పనుల్లో వచ్చిన మట్టిని విచ్చలవిడిగా అమ్ముకున్నారు. ఇటు ఈ 8 కోట్లు, అటు ఆ మట్టి విక్రయాలతో గుత్తేదారు అందినకాడికి దోచేశారు. 25 నుంచి 26.8 కిలోమీటర్ల వరకు పనులను కోటీ 20 లక్షలకు అప్పగించారు.

మరోవైపు 5వ ప్యాకేజీలో రెండు పాయలుగా ఉండే బుడమేరు మధ్యలో నేతల అండతో పట్టా భూములను ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులు తవ్వేశారు. దీంతో కొల్లేరులో కలవాల్సిన ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడి పంట పొలాలు మునిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆక్రమణ కోరల్లో 'బుడమేరు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.