YSRCP EX MLA Adeep Raj Response on Suicide Attempt News : తాను ఆత్మహత్య చేసుకున్నానని వచ్చిన వదంతులను నమ్మొద్దని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టు వచ్చిన వార్త,లపై అదీప్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ లు అవాస్తవాలంటూ ఆయన ఓ విడియో విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి బయటకు వెళ్లినట్టు ఆయన చెప్పారు. గ్యాస్టిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని, తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వీడియోలో తన ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేశారు.
తాను బాగున్నానని పుకార్లు నమ్మవద్దని మరో రెండు రోజుల్లో కార్యకర్తలకు నాయకులకు అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు ఓడిపోయిన బాధలో ఉన్నామని ప్రతి విషయాన్ని ఏదో హడావుడి చేసి పుకార్లు సృష్టిస్తున్నారని అదీప్ రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఆరోగ్యం నలతగా ఉండడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చానే గాని ఎటువంటి ఆందోళన లేదని అన్నారు.
పెందుర్తి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌కు ఎన్నికల వేళ భారీ స్థాయిలో వ్యతిరేఖత నెలకొన్న విషయం తెలిసిదే. అనకాపల్లి జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రాహంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా అదీప్‌రాజ్ ప్రచార వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలోని సమస్యలు ఐదేళ్లుగా పరిష్కారం కాలేదని అదీప్ రాజును స్థానికులు నిలదీశారు.
YSRCP EX MLA Adeep Raj Visakaha : గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఇప్పుడెలా ఓట్లు అడుగుతారని గ్రామస్థులు ప్రశ్నించారు. స్థానికుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఇలా అడిగితే రేపటి నుంచి గొడవలు తప్పవు అని గ్రామస్థులను అదీప్ రాజు హెచ్చరించటం అప్పట్లో చర్చనీయాంశమైంది. పార్టీ కార్యకలాపాలకు సైతం అదీప్ రాజ్ ( Adeep Raj ) దూరంగా ఉంటూ రావడం, ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలవడంతో అతడి ఆత్మహత్య వదంతు ప్రజలను కలవర పరిచింది.