YSRCP Contractor Broke into Maidukuru Municipal Office: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దహనం మరువక మునుపే వైఎస్సాఆర్ జిల్లా మైదుకూరు పురపాలక కార్యాలయంలోకి వైఎస్సార్సీపీ హయాంలో గుత్తేదారుగా పనిచేసిన మణ్యం రమేష్ రెడ్డి చొరబడ్డారు. అధికారులు కార్యాలయానికి ముందే ఇంజనీరింగ్ అధికారి గదిలోకి చేరి రికార్డుల కోసం టంకుపెట్టెలో శోధించడం చర్చనీయాంశమైంది. టీడీపీకి చెందిన నాయకుడు ఒకరు వీడియోను చిత్రీకరించి పత్రికా విలేకరులకు వంపారు. ఆదృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి.
ఆ వీడియో ఎమ్మెల్యే వుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ జబ్బార్ మియ్యా తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పురపాలకలోని పలు రకాలను పనులను పురపాలక పరిధి గడ్డమాయపల్లెకు చెందిన రమేష్ రెడ్డి చేశారు. అప్పట్లో అంతా తానై పనులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారినా గుత్తేదారు పురపాలక కార్యాలయం అంటి పెట్టుకుని ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే ఉదయం 9.50 గంటలోపే రమేష్‌రెడ్డి కార్యాలయం వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
అప్పటికి అక్కడి సిబ్బంది ఒక్కొక్కరుగా చేరుకుంటున్న సమయంలో ఇంజనీరింగ్ అధికారి గదిలోకి రమేష్ రెడ్డి ప్రవేశించారు. రెండేళ్ల కిందట చేసిన పనులకు రావాల్సిన రీఫండ్‌కు సంబంధించి రికార్డుల గురించి అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌ను అడిగారు. ఇంజనీర్ వచ్చాక రావాలని కంప్యూటర్ ఆపరేటర్ సూచించినా ఏమాత్రం ఖాతరు చేయకుండా నేను వెతుక్కుంటానులే అంటూ రికార్డులు భద్రపరచిన గదిలోకి రమేష్ రెడ్డి వెళ్లారు. అక్కడ ఉన్న ఉన్న ఫైల్స్‌ను తిరగవేస్తూ ఉండగా టీడీపీ నాయకుడు వీడియో చిత్రీకరించారు.
దీన్ని గమనించిన గుత్తేదారు రమేష్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారి గది నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని అధికారులు సిరియస్‌గా తీసుకున్నారు. అక్కడి నుంచి రమేష్ ఎలాంటి పత్రాలను తీసుకుపోలేదని కమిషనర్ జబ్బార్ మియ్యా తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ బెదిరించి టంకు పెట్టెలోని రికార్డులను తనిఖీ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు.
పెద్దిరెడ్డి చెరలో 236 ఎకరాలు - ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు - Peddireddy Land Grabs
గుంటూరులో చెత్తలో ఫైళ్లు - అధికారులు వచ్చే సరికి మాయం - File In Garbage Tahsildar Office