ETV Bharat / state

హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - వివేకా హత్యపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha

YS Sunitha Met Home Minister Anitha: హోం మంత్రి అనితను వైఎస్ వివేకా కుమార్తె సునీత కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు ఆమె వివరించారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు.

YS Sunitha Met Home Minister Anitha
YS Sunitha Met Home Minister Anitha (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 11:13 AM IST

Updated : Aug 7, 2024, 11:37 AM IST

YS Sunitha Met Home Minister Anitha : హోం మంత్రి వంగలపూడి అనితతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో (Viveka Murder Case) జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్ష్యుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు.

తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టం : ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న అనిత, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

'హూ కిల్డ్ బాబాయ్​'కి త్వరలోనే సమాధానం వస్తుంది: చంద్రబాబు - Who Killed Babai

ఆరోజు జగన్​ ఇంట్లో సమావేశం- అవినాష్​ ఫోన్లో ఏం మాట్లాడారు! వెలుగులోకి సంచలన విషయాలు - viveka murder case

వివేకా హత్య వెనకుంది అతడే- ప్రజా తీర్పు కోసమే సాక్ష్యాలు చూపిస్తున్నా: సునీతా - YS Sunitha About Viveka Murder Case

Last Updated : Aug 7, 2024, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.