ETV Bharat / state

MOUపై సంతకం ఎలా చేశారు? అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? - జగన్‌కు ప్రశ్నలు సంధించిన షర్మిల

చెల్లిపై ప్రేమతో జగన్‌ షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమన్న షర్మిల - జగన్‌ బెయిల్ రద్దుకు కుట్ర అనడం శతాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా

YS_Sharmila
YS Sharmila (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

YS Sharmila Questions to Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిల ఆస్తుల వివాదం ముదురుతోంది. తాజాగా ఆస్తుల వ్యవహారంలో జగన్‌కు షర్మిల పలు ప్రశ్నలు సంధించారు. చట్ట విరుద్ధమని తెలిసినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలి మీద ప్రేమతో షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఆస్తుల మీద ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మర్చిపోయారని, అందుకే ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పవలసి వస్తుందని తెలిపారు.

నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని షర్మిల మండిపడ్డారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకూ తీసుకెళ్లారన్నారు. ఆస్తులను లాక్కోవటానికి, ఈడీ కేసులని, బెయిల్ క్యాన్సిల్ అవుతుందని కారణాలు చెబుతున్నారని, కానీ అవేవీ వాస్తవం కాదని స్పష్టం చేశారు.

స‌ర‌స్వతీ కంపెనీ షేర్ల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఎటాచ్ చేయలేదని, అది కేవ‌లం రూ. 32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్ర‌మే ఎటాచ్ చేసిందని తెలిపారు. కంపెనీ షేర్ల‌ను ఎప్పుడూ ఎటాచ్ చేయ‌లేదని, ఏ స‌మ‌యంలోనైనా వాటిని బ‌దిలీ చేసుకోవ‌చ్చని షర్మిల అన్నారు. ఏ కంపెనీ ఆస్తుల‌నైనా ఈడీ ఎటాచ్ చేసినా, ఆ కంపెనీ షేర్ల బ‌దిలీని మాత్రం ఎప్పుడూ ఆప‌లేదని, స్టాక్ మార్కెట్ల‌లో ఉన్న చాలా కంపెనీలు కూడా వాటి ఆస్తుల‌ను ఈడీ ఎటాచ్ చేసిన‌వి ఉన్నాయని పేర్కొన్నారు. అయినా వాటి ట్రేడింగ్ అవుతోందని, షేర్లు బ‌దిలీ కూడా అవుతున్నాయన్నారు.

అన్నగా, మేనమామగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే - జగన్​కు షర్మిల కౌంటర్

2016లో ఈడీ ఎటాచ్ చేసినందువ‌ల్ల షేర్లు బ‌దిలీ చేయకూడదని జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వాదిస్తున్నారని, చేస్తే బెయిల్ రద్దు అవుతుందని బీద ఏడ్పులు ఏడుస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు పలు ప్రశ్నలను షర్మిల సంధించారు.

  1. 2019లో షర్మిలకు 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ MOUపై సంతకం ఎలా చేశారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?
  2. 2021లో క్లాసిక్, సండూరులో ఉన్న కంపెనీ షేర్లను రూ.42 కోట్లకు కొనుగోలు చేసేందుకు తల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌కి ఎలా అనుమతి ఇచ్చారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?
  3. 2021లో తన, తన భార్య షేర్లపై సంతకం చేసి, వైఎస్ విజ‌య‌మ్మ‌కి ఫోలియో నంబర్లతో పాటు గిఫ్టుగా గిఫ్ట్ డీడ్ ఎలా ఇచ్చారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?

వాస్తవం ఏమిటంటే మొన్న ఎలక్షన్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన తర్వాత, 2024లో ఈ ప్రాజెక్టును వదులుకోవడం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇష్టం లేక‌, భారతీ సిమెంట్స్ బ్యానర్ కింద సరస్వతి సిమెంట్​ను నిర్వ‌హించాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఈడీ ఎటాచ్​మెంట్ అంశాన్ని లేవనెత్తారు. షేర్లను బదిలీ చేయలేమంటూ చెబుతున్నారు. షేర్లను బదిలీ చేయవచ్చు. ఎందుకంటే ఎటాచ్ చేసిన‌ది కేవ‌లం కంపెనీకి చెందిన భూమి మాత్రమే త‌ప్ప‌ కంపెనీ షేర్లు కాదని షర్మిల మరోసారి స్పష్టం చేశారు.

"ఆలోచన, ప్రవర్తనలో మార్పు వస్తే ప్రేమ పునరుద్ధరిస్తా" - షరతులు వర్తిస్తాయన్న జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.