ETV Bharat / state

ఆస్తిలో వాటా నా హక్కు- రేపు మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు: షర్మిల - YS SHARMILA ELECTION CAMPAIGN

YS SHARMILA COMMENTS: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం కర్నూలు జోరుగా కొనసాగుతోంది. న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను జగన్ వంచించారని ఆమె ఆగ్రహంవ్యక్తం చేశారు. కుటుంబ ఆస్తులపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, రేపు తమకు ఏమవుతుందో తెలియదని, అయినా మొండిగా పోరాడుతున్నామని షర్మిల వ్యాఖ్యానించారు.

YS_SHARMILA_ELECTION_CAMPAIGN
YS_SHARMILA_ELECTION_CAMPAIGN
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 2:10 PM IST

Updated : Apr 21, 2024, 8:09 PM IST

YS SHARMILA COMMENTS : కర్నూలులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల న్యాయయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్​పై విమర్శల వర్షం కురిపిస్తోంది. కర్నూలుకు న్యాయరాజధాని అంటూ జగన్ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రచారం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అఫిడవిట్ లో పేర్కొన్న అప్పుల అంశంపై వివిరణ ఇచ్చారు. అదే సమయంలో న్యాయం కోసం పోరాడుతున్న తమకు, తమ పిల్లలకు రేపు ఏమౌంతుందోనన్న ఆందోళనను షర్మిల వ్యక్తం చేశారు.

అప్పులపై అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు. నిజానికి చెల్లికి ఏ అన్న అయినా ఆస్తిలో వాటా ఇవ్వాలి, ఆడబిడ్డకు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉందన్నారు. మేనమామగా కూడా అన్నకు బాధ్యత ఉందని షర్మిల పేర్కొన్నారు. కొందరు చెల్లికివ్వాల్సిన వాటాను కూడా తమదిగా భావిస్తారని విమర్శించారు. చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఎలాంటి ఆస్తులు పంచారనేది కుటుంబం మొత్తానికి, దేవుడికీ తెలుసని షర్మిల వెల్లడించారు. తమ పోరాటం ఆస్తుల కోసం కాదు, న్యాయం కోసమని షర్మిల స్పష్టం చేశారు. రేపు మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు, న్యాయం మొండిగా కోసం పోరాటం చేస్తున్నామని షర్మిల వెల్లడించారు.

కర్నూలు న్యాయ యాత్ర బహిరంగసభలో ప్రసగించిన షర్మిల, కర్నూలు న్యాయ రాజధాని పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. నేడు కర్నూలు, నందికొట్కూరు, నంద్యాలలో పర్యటిస్తున్నారు. కర్నూలును స్మార్ట్‌ సిటీ చేస్తామన్నారని, కనీసం మంచినీళ్లు కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని షర్మిల ప్రశ్నించారు. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే కర్నూలు వాసులకు నీళ్లు వచ్చేవన్న షర్మిల, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అన్నారు.

జగన్​ సభ నిండుగుండాలంటే మందు ఫుల్లుగుండాలా!- 20 లక్షల బాటిళ్లు- మద్యం వ్యాపారం అంటే ఇదే! - LIQUOR in CM Jagan meetings

ఏటా జనవరికి జాబ్‌ క్యాలెండర్‌ అన్నారని, ఏదీ ఎక్కడ కనపడదే అంటూ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ, విద్యుత్‌తో పాటు అన్నింటి ఛార్జీలు పెంచారని, ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమంటూ బయల్దేరారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా అని మోసం చేసినందుకు సిద్ధమా, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికి సిద్ధమా అంటూ వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

పులులు, సింహాలని చెప్పుకునే వారు బీజేపీని చూసి పిల్లుల్లా తయారయ్యారు: షర్మిల - ys sharmila election campaign

రేపు మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు

Last Updated : Apr 21, 2024, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.