YS Sharmila Comments on Elections : కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు నేతలు సిద్ధంగా ఉండాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సూచించారు. విశాఖ ఉక్కు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం, అమరావతి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఇప్పటి వరకూ 15 వందల అప్లికేషన్లు వచ్చాయని షర్మిల వెల్లడించారు.
పోటీపై షర్మిల కీలక వ్యాఖ్యలు: కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం, ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో షర్మిల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అధిష్ఠానం ఆదేశిస్తే తానైనా, ఇతర ముఖ్య నాయకులు అయినా ఆదేశాలు పాటించాలన్నారు. సజ్జల సమాధానం చెప్పాల్సింది రాష్ట్రంలో సమస్యల పైనే అన్నారు. సజ్జల ఏ కలలు కంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని షర్మిల విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కానివ్వమన్నారు. కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి, ఎంపీగా ఉండి ఎందుకు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఎందుకు పోరాటం చేయలేదని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందని షర్మిల పేర్కొన్నారు.
అదానీ, అంబానీలకు మాత్రమే: అంతకు ముందు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల సమావేశంలో పాల్గొన్న షర్మిల సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. దేశ సంపదను భారతీయ జనతా పార్టీ అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని షర్మిల ఆరోపించారు. గంగవరం పోర్టు భూములను అదానీకి తక్కువ ధరకే కట్టబెట్టారని దుయ్యబట్టారు. బీజేపీ చేసిన మోసానికి జగన్ మౌనం వహించారని విమర్శించారని విర్శించారు. అందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు షర్మిల స్పష్టం చేశారు.
'రాష్ట్రానికి రాజధాని ఏదీ ? - ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఐక్య పోరాటాలు' - Sharmila fire on BJP
'ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల పోటీకి సంబంధించి ఇప్పటి వరకూ సుమారు 15 వందల అప్లికేషన్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎవ్వరైనా పార్టీ ఆదేశాల మేరకు పని చేయాల్సిందే. రేవంత్ రెడ్డి విశాఖకు ఎందుకు వచ్చారో అనే అంశంపై సజ్జల సమాధానం చెప్పాలి. పోలవరం, కడప స్టీల్, అమరావతి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పని చేస్తుంది. సీట్ల ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన చేస్తాం.' షర్మిలారెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్
విద్యుత్ బకాయిలు చెల్లించండి - విశాఖ ఉక్కు పరిశ్రమకు నోటీసులు - Visakha steel industry