YS Jagan Fire On YS Sharmila: సీఎం జగన్ తాజాగా పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో సొంత చెల్లి, ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై చేసిన విమర్శలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పసుపు చీర కట్టుకుని, వైఎస్ శత్రువులకు ఆహ్వానించారంటూ సీఎం జగన్, షర్మిలపై విమర్శల వర్షం కురిపించారు. నిజానికి షర్మిల తన కుమారుడు రాజా వివాహాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరిలో ఆమె పలువురు అగ్రనేతలను వారి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు.
షర్మిల కట్టుకున్న చీరపై జగన్ కామెంట్లు: షర్మిల తన కుమారుడు వివాహ ఆహ్వానంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె హైదరాబాద్ నివాసంలో కలుసుకున్నారు. కుమారుడి వివాహ పత్రికను ఇవ్వడంతోపాటు.. స్వీట్లు, కానుకలు కూడా ఇచ్చారు. ఈ సమయంలో ఆమె లైట్ ఎరుపు రంగు బార్డర్ ఉన్న పసుపు రంగు చీరను దరించారు. ఇది అనుకుని చేశారో, లేదా యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు. ఎవరూ కూడా దీనిపై ఇప్పటి వరకు కామెంట్లు చేయలేదు. ఇది సభ్యత కూడా కాదని అందరికీ తెలిసిందే. కానీ, తాజాగా సీఎం జగన్, ఇదే చీరపై కామెంట్లు చేశారు. పసుపు రంగు చీర కట్టుకుని, వైఎస్ శత్రువులకు ఆహ్వాన పత్రికలు అందించారంటూ నాటి ఘటనను పులివెందుల రాజకీయ సభలో తెరపైకి తీసుకొచ్చారు.
స్పందించిన వైఎస్ షర్మిల: తాను కట్టుకున్న చీర గురించి రాజకీయ వేదికపై జగన్ సభలో మాట్లాడటం దారుణంమని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సొంతచెల్లెలు వేసుకున్న బట్టలపై వేల మంది సభలో మాట్లాడుతారా? మీద ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు! ఇంత దిగజారుడు రాజకీయాలు ఏం అవసరం ఉంది?. నా వొంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా ? అంటూ తీవ్ర స్థాయిలో జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానా? పసుపు రంగు ఏమైనా చంద్రబాబుకు పేటెంట్ రైటా? అని ఆమె ప్రశ్నించారు. పసుపు మంగళకరమైన రంగు అని స్వయంగా వైఎస్ చెప్పారని ఆమె గుర్తు చేశారు. చూసుకుంటూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది జగనే అంటూ సెటైర్ వేశారు. అసెంబ్లీలో వైఎస్‌ను తిట్టినవారు ఇవాళ జగన్‌కు బంధువులంటూ షర్మిల ప్రతి దాడికి దిగారు.
చంద్రబాబు రియాక్షన్: ఇదే అంశంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. “తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?“ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు నిప్పులు చెరిగారు.
చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల - కుమారుడి పెళ్లికి ఆహ్వానం