ETV Bharat / state

యూట్యూబ్‌ స్టార్‌ అప్పలమ్మ - డైలాగ్స్​, ఫైట్స్​లో ఆల్ ​రౌండర్​!

సరదాగా తీసిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​

Srikakulam YouTube Star Appalamma
Srikakulam YouTube Star Appalamma (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 8:43 AM IST

Srikakulam YouTube Star Appalamma : ఏడు పదుల వయసులో నడవడానికీ ఇబ్బంది పడుతుంటారు. అప్పలమ్మ మాత్రం చిరంజీవి, ప్రభాస్, మహేశ్​బాబు, ఇలా తెలుగు సినిమా హీరోలందరి డైలాగులు చెప్పేస్తుంది. వారిలానే ఫైటింగ్‌ చేసి విలన్లను చితక్కొట్టేస్తూ యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం పెద్ద కర్రివానిపాలెం అప్పలమ్మ స్వగ్రామం. వీరిది మత్స్యకార కుటుంబం. కూలి పనులు చేస్తూ, భర్త తెచ్చే చేపలను ఊరూరా తిరిగి అమ్ముకుని జీవనం సాగించేది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ పెళ్లిళ్లు చేసేసి, బాధ్యతలు పూర్తయ్యాక కొన్నేళ్లుగా వయోభారంతో ఇంటికి పరిమితమయ్యింది. అసలు కథ ఆ తర్వాతే మొదలైంది.

మూడు సంవత్సరాల క్రితం ఆమె మనవడు శివ అప్పలమ్మతో సరదాగా వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. వాటికి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నుంచి కాస్త పెద్ద వీడియోలు, సినిమా ఫైట్ల అనుకరణ సీన్లు తీయడం మొదలెట్టారు. అప్పుబాలు అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి అందులో వీటిని పెడుతున్నారు. శివ దర్శకత్వంలో అప్పలమ్మ, వీరి పక్కింటబ్బాయి బాలు, అవసరం మేరకు గ్రామంలోని పిల్లలు, యువకులు నటిస్తారు.

Appalamma Hilarious Dialogues : అప్పలమ్మ వీడియోలు చూసి ఇలాగే నటించు ఈ రంగంలో ఎదుగుతావని ఫోన్లు చేసి చెబుతుంటారు కొందరు. అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తానని అంటోంది అప్పలమ్మ. కానీ తన కంటే మనవడికి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నానని చెబుతోంది. ఈ వయసులో ఇవన్నీ అవసరమా నటిస్తుంటే సిగ్గేయదా అని తన తోటోళ్లు అడిగితే సిగ్గు చిన్నప్పుడే పోయిందని సరదాగా బదులిస్తానని చేప్పే అప్పలమ్మకు నటన హుషారు తెస్తుందట.

రోజూ ముఖానికి రంగులు వేసుకోవడం, షర్టులూ, టీషర్టులూ వేసుకోవడం, ఆయుధాలు పట్టుకోవడం ఇసుకలో, ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా నడవడమూ అప్పలమ్మకు కష్టమే. కొన్నిసార్లు కాళ్లు, చేతులు నొప్పి పుడతాయి. అయినా మందులు వేసుకొనైనా నటిస్తుంటుంది. డైలాగుల్లో కొన్ని ఇంగ్లిషు పదాలు వస్తాయి. అవి చెప్పడానికీ ప్రయత్నిస్తుంది. వీరి ఛానల్‌ ఈమధ్యే లక్ష సబ్‌స్క్రైబర్లను దాటేసింది. పిల్లలతో సరదాగా వీడియోలు చేస్తుంటే తెలియకుండానే రోజు గడిచిపోతుంది. నీవల్లే మన గ్రామం పేరు చాలా మందికి తెలిసిందని చాలామంది అంటుంటారు. అలాంటప్పుడు నా కష్టమంతా మర్చిపోతానని సంతోషంగా చెబుతుంది అప్పలమ్మ. ఆరోగ్యం సహకరించినన్ని రోజులు నటిస్తూనే ఉంటానంటోన్న ఈ బామ్మ ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదా!

Vithika Sheru: మిలియన్​ ఫాలోవర్లకు చేరువలో... భీమవరం పిల్ల..!

నంబర్​-1 యూట్యూబ్ ఛానల్​గా 'మిస్టర్ బీస్ట్' - రెండో స్థానానికి పడిపోయిన 'టీ-సిరీస్' - MrBeast

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.