Romance on Bike : బైక్ రేసింగ్ గతంలో ప్రధాన నగరాల్లో మాత్రమే కనిపించేది. ప్రస్తుతం అది ఏపీలోనూ అన్ని ప్రాంతాలకు విస్తరించింది. యువకులు ఖరీదైన బైక్‌లు కొనుగోలు చేసి కడప నగర శివార్లలోని రోడ్లపై ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నారు. అవి వారితో పాటు ఇతరులకు ఇబ్బంది కరంగా మారడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
అర్ధరాత్రి యువకులు హల్చల్.. బైక్‌లతో ప్రమాద విన్యాసాలు
కడపలో యువకులు రీల్స్ పేరుతో రెచ్చిపోతున్నారు. మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం రోడ్డు, రిమ్స్ ప్రధాన రహదారిపై రీల్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం రోడ్డు, రిమ్స్ ప్రధాన రహదారిపై ఆకతాయిలు పట్టపగలే బైక్ రేసులతో రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వాయు వేగంతో ఫీట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బైక్‌ల అతి వేగం కారణంగా వాహనదారులు భయాందోళనలకు గురవుతుండగా కట్టడి చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు కేవలం ఛలాన్లకే పరిమితమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్టంట్ల సంగతి అలా ఉంచితే బైక్‌లపై ప్రేమికుల విన్యాసాలు విసుగు తెప్పిస్తున్నాయి. సాధారణంగా పార్కుల్లో కనిపించే రొమాన్స్ సీన్లు ఇప్పుడు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. బరితెగించిన ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై ముద్దుల్లో మునిగిపోయింది. యువతీ, యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ అసహ్యంగా ప్రవర్తించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నలుగురు చూస్తారనే ఆలోచన, భయం కూడా లేకుండా బైక్‌పై ముద్దుల్లో మునిగి తేలిపోయారు.
హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిపై ప్రేమ జంట బైక్ మీద వెళ్తూ అసభ్యంగా ప్రవర్తించడం చూసి అటుగా వెళ్లే వాళ్లు అవాక్కయ్యారు. ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రియురాలు అతడి ముందు ట్యాంక్‌పై ఎదురుగా కూర్చుని ముద్దుల్లో ముంచెత్తింది. యువకుడు బండి నడుపుతుంటే గట్టిగా కౌగిలించుకొని ముద్దులు కురిపించింది. ప్రియుడు సైతం ఆమెతో సరసాలాడుతూనే బైక్‌ను నడిపాడు. పక్కనే ద్విచక్ర వాహనాలపై ఎంతో మంది వెళ్తున్నా రొమాన్స్‌కు బ్రేక్ ఇవ్వలేదు. చుట్టుపక్కలవాళ్లు తమనే గమనిస్తున్నారన్న సోయి కూడా లేకపోవడం విచారకరం.
హైదరాబాద్‌లో బైక్ రేసింగులతో రెచ్చిపోతున్న యువత.. పలువురి అరెస్ట్..