ETV Bharat / state

మిర్రర్ రైటింగ్​లో విశాఖ యువతి పతకాల పంట- 134 భాషల్లో 'వందేమాతరం' - Woman Excels in Mirror Writing - WOMAN EXCELS IN MIRROR WRITING

Young Woman Excels in Mirror Writing: మాతృభాషలోనే తప్పులు లేకుండా రాయడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మిర్రర్ రైటింగ్​లో పతకాల పంట పండిస్తోంది విశాఖకు చెందిన యువతి. వందేమాతరం గీతాన్ని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 134 భాషల్లో సునాయాసంగా తిరగరాసి అబ్బురపరిచింది. ఇటీవలే బెస్ట్ అచీవర్స్‌ అవార్డును సొంతం చేసుకుని విశేష గుర్తింపును దక్కించుకుంది.

Young_Woman_Excels_in_Mirror_Writing
Young_Woman_Excels_in_Mirror_Writing (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 2:44 PM IST

Young Woman Excels in Mirror Writing: మాతృభాషను తప్పులు లేకుండా రాయడానికి కొందరు ఇబ్బందిపడుతూ ఉంటారు. అటువంటిది మాతృభాషతో పాటు మరో 134 భాషల్లో వందేమాతరం గేయాన్ని మిర్రర్ రైటింగ్ ద్వారా రాసి తన ప్రత్యేకతను చాటుకుంటోంది విశాఖ జిల్లా పెదవలస గ్రామానికి చెందిన మామిడి రమ్య. 134 భాషలలో వందేమాతరం గేయాన్ని తిరగరాసినందుకుగాను ఇటీవలే బెస్ట్ అచీవర్స్‌ అవార్డును సొంతం చేసుకుని విశేషమైన గుర్తింపును దక్కించుకుని మరికొందరికి ఆదర్శంగానూ, నేటి యువతకు మార్గదర్శకంగాను నిలుస్తోంది.

మిర్రర్ రైటర్ రమ్య చదువు రీత్యా కొంతకాలంగా నర్సీపట్నం సమీపంలోని ధర్మసాగరంలో బంధువుల ఇంటి వద్ద ఉంటోంది. రమ్యకు మరో ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న మిర్రర్ రైటింగ్ ఇప్పుడు తనకెంతో గుర్తింపును తెస్తూ ఎన్నో అవార్డులను దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని రమ్య సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఒలంపిక్స్​లో పసిడి పతకమే లక్ష్యం - పవర్‌లిఫ్టింగ్‌లో ​గుంటూరు యువ క్రీడాకారుడు సత్తా - Power Lifter Bharat Kumar

మిర్రర్ రైటింగ్​లో విశాఖ యువతి పతకాల పంట- 134 భాషల్లో 'వందేమాతరం' (ETV Bharat)

మిర్రర్ రైటింగ్ పోటీలు వివిధ దేశాల్లో జరుగుతున్నాయని, ఆర్థిక ఇబ్బందులతో వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. వైవిధ్యమైన ఈ మిర్రర్ రైటింగ్ పోటీలకు సంబంధించి వివిధ దేశాల్లో పాల్గొనడానికి ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నాయని రమ్య పేర్కొంటోంది. ఆన్​లైన్, తదితర ప్రక్రియలకు తన శక్తికి మించి నగదు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరైనా ప్రోత్సహిస్తే మరింత ప్రతిభను చాటుకునేందుకు కృషి చేస్తానని రమ్య ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మన్యం ప్రాంతంలో తాను చిన్న కిరణా వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ నలుగురు పిల్లలను విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని మిర్రర్ రైటర్ తండ్రి వెంకట్రావు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పిల్లలపై ప్రభావం చూపకుండా నెట్టుకొస్తున్నామని పేర్కొన్నారు.

"చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న మిర్రర్ రైటింగ్ నాకు ఎంతో గుర్తింపును తెస్తూ ఎన్నో అవార్డులను దక్కుంచుకునే అవకాశాన్నికల్పిస్తోంది. ఈ మిర్రర్ రైటింగ్ పోటీలు వివిధ దేశాల్లో జరుగుతున్నాయి. అయితే ఆర్థిక స్తోమత లేక పోటీల్లో పాల్గొనలేకపోతున్నాను. ఎవరైనా సాయం చేస్తే పోటీల్లో పాల్గొని మరింత ప్రతిభను చాటుకునేందుకు కృషి చేస్తాను." - మామిడి రమ్య, మిర్రర్ రైటర్

విధి వెక్కిరించినా ఆత్మస్థైర్యంతో ముందుకు దూసుకెళ్తున్న యువకుడు - handicapped person successful story

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.