Young Man Suicide in Sangareddy : ప్రస్తుత రోజుల్లో కొంత మంది యువకులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపం చెంది చనిపోయేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ప్రేమ విఫలమైతే ఆత్మహత్యను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు తన ప్రేమ పెళ్లికి యువతి తండ్రి నిరాకరించాడని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం ఆనెగుంటకు చెందిన పెద్దగొల్ల వెంకట్(30) నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండకు చెందిన యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకున్నారు. అనంతరం వారు ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ యువతి తన తండ్రితో చెప్పింది. తరవాత వెంకట్‌ను బాల్కొండకు రప్పించి, తన కుటుంబసభ్యులను తీసుకువచ్చి మాట్లాడాలని సూచించింది.
అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య - మృతికి అదే కారణమా? - YOUNG MAN SUICIDE In gundala mandal
Young Man Suicide due to Love : యువకుడు తన సోదరుడితో కలిసి బాల్కొండకు వెళ్లి యువతి తండ్రిని కలిశాడు. అయితే తండ్రిదండ్రులు లేకుండా వస్తావా అంటూ నిరాకరించి ఆయన వెనక్కి పంపించారు. గత మూడు రోజుల క్రితం వెంకట్‌తో పాటు అతని తండ్రి జగన్నాథంకు యువతి తరుపు బంధువులు ఫోన్ చేసి అమ్మాయికి చెందిన బంగారు ఆభరణాలు తీసుకున్నావని, దాని గురించి ఆదివారం(తరవాతి రోజు) మాట్లేందుకు రావాలని బెదిరించారు. ప్రేమ విఫలం కావడంతో పాటు బంగారం విషయంలో భయాందోళనకు గురి చేస్తున్నారని మనస్తాపంతో జహీరాబాద్ సమీపంలోని పంట పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
"ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాం. విచారణ చేస్తే వెంకట్ అనే యువకుడు బాల్కొండకు చెందిన అమ్మాయిని ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుని లవ్ చేసుకున్నారని తెలిసింది. వాళ్ల పెళ్లి అమ్మాయి ఇంట్లో ఇష్టం లేదు. తరవాత యువకుడు మసస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తాం." - ప్రసాద్ రావు, జహీరాబాద్ రూరల్ ఎస్ఐ
త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య - Serial Actor Chandu Suicide