ETV Bharat / state

రుణం మొత్తం చెల్లించినా - ఆగని లోన్​యాప్​ వేధింపులు - మరో ప్రాణం బలి - Man Suicide by Loan App Harassment

Man Suicide in Hyderabad : లోన్​ యాప్​ ఒత్తిడి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్​లో చోటుచేసుకుంది. రుణం చెల్లించినా ఒత్తిడి చేస్తుండటంతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Man Commited Suicde by Loan App Harassment
Man Suicide in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 11:57 AM IST

Man Commited Suicde by Loan App Harassment : లోన్​ యాప్​ల నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. అధిక వడ్డీలు వసూలు చేస్తూ పీల్చిపిప్పి చేస్తున్నారు. తాజాగా లోన్​ యాప్ ఒత్తిడి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్​బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కె.విజయవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన ఎం.వినోద్ కుమార్ (34) కుటుంబం బతుకు దెరువు కోసం సుచిత్ర కూడలి సమీపంలోని శ్రీరాంనగర్‌లో నివసిస్తోంది. వినోద్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేసేవాడు. తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు.

ఈ క్రమంలో భార్య మంజుషా దేవితో చరవాణిలో దిగిన ఫొటో రుణ యాప్​లో పెట్టి రూ.2,514 రుణం తీసుకున్నాడు. క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఆమెకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. సకాలంలో చెల్లించకపోవటంతో లోన్​యాప్​ నుంచి ఒత్తిడి అధికమైంది. సంబంధీకుల ఫొటోను మార్ఫింగ్‌ చేసి స్నేహితులకు, బంధువులకు పంపుతున్నారు. లోన్‌ యాప్‌ విషయం తెలుసుకున్న మంజుషా దేవి సోదరుడు తిరిగి రుణం చెల్లించాడు. అయినా యాప్ వారు తిరిగి డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండటంతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

వినాయక చవితి పండగకు వస్తానని : ఈ నెల 8న వినోద్‌ కుమార్‌ పెళ్లి రోజు. వినాయక చవితి పండుగ కూడా ఉండటంతో మంజుషా దేవి కార్మికనగర్​లోని సోదరుడి ఇంటికి వెళ్లింది. తాను కూడా వస్తానని చెప్పి రాకపోవడంతో భార్య ఆదివారం నుంచి ఎంత ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో వీరి సమీప బంధువు సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్​కు ఉరేసుకుని వేలాడుతూ కన్పించాడు. ఇరుగు పొరుగు సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా, అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోన్​యాప్​ వేధింపులకు మరో ప్రాణం బలి - చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య

'బావా క్షమించు - నా ముఖం చూపించలేక వెళ్లిపోతున్నా' - అసలేం జరిగింది? - Woman Suicide by Loan App

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.