YCP Political Meeting at Tirumala Parveti Mandapam: హిందూ ధర్మ వ్యాప్తి సనాతన ధర్మ పరిరక్షణకు సలహాలు సూచనలు కోరుతూ తిరుమల ఆస్థాన మండపంలో పెద్ద ఎత్తున ధార్మిక సదస్సు ఓ వైపు తిరుమలలో పవిత్రమైన శ్రీవారి పార్వేటి మండపంలో అధికార వైసీపీ నేతలు కుల సంఘాల ఆత్మీయ సమావేశాలు మరో వైపు జరుగుతున్నాయి. హిందూ ధర్మం గురించి ఆర్భాటపు ప్రసంగాలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా అధికార వైసీపీ నేతలు తమ రాజకీయ అవసరాలకు టీటీడీ భవనాలను వినియోగించుకుంటున్నారు.
నిబంధనల మేరకు తిరుమల కొండపై ఎన్నికల ప్రచారాలు నిషేధం. కాని వైసీపీ నేతలు భూమన అభినయ్ రెడ్డికి మద్ధతుగా కుల సంఘాలతో వైసీపీ సమావేశాలు నిర్వహించారు. తిరుమల పార్వేట మండపంలో కుల సంఘ సమావేశాన్ని నిర్వహించి తిరుమల శ్రీవారి పవిత్రను మంటగలిపారన్న విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
తిరుమలలో డ్రోన్ కలకలం - మరోసారి బయటపడిన నిఘా వైఫల్యం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు అభినయ్ రెడ్డిని గెలిపించుకునేందుకు టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుపతిలో తన కుమారుడి నేతృత్వంలో పలు కుల సంఘం నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా తిరుమలలోని పార్వేటి మండపంలో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఒక సమావేశాన్ని నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. శనివారం ఉదయం పార్వేటి మండపంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారితో సమావేశం నిర్వహించారు.
టీటీడీ పాలక మండలి సమావేశం - కీలక నిర్ణయాలు ఇవే
తిరుమల వ్యాపారులను పార్వేట మండపంలో సమావేశపరచి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న భూమన అభినయ రెడ్డిని గెలిపించాలని ముద్ర నారాయణ కోరారు. త్వరలో మరో ఆత్మీయ సమవేశం నిర్వహించుకుని మరిన్ని అంశాలు చర్చించుకుందామని అందరూ అభినయ్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. సమావేశంలో కుల ప్రముఖులను సన్మానించారు. తిరుమలలో పార్వేటి మండపం తితిదే అధీనంలో ఉంటుంది. కనుమ పండుగ రోజున శ్రీమలయప్పస్వామి, శ్రీ కృష్ణస్వామివార్లను పార్వేటి మండపానికి తీసుకువస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయానికి తీసుకువెళ్తారు.
తిరుమలగిరుల్లొ మంచు సోయగం - కనువిందుగా దైవ దర్శనం
అదే విధంగా కార్తీక మాసం సమయంలో తితిదే అధికారులు అక్కడ వనభోజనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. అంతటి పవిత్రమైన ప్రాంతంలో వైసీపీ నేతలు బరితెగించి అధికార పార్టీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తికి ఎలా ప్రచారం చేస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమల పవిత్రను కాపాడాల్సిన ఛైర్మన్ పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ విధంగా తన కుమారుడికి ఓటు వేసి గెలిపించాలంటూ కుల సంఘాలతో సమావేశం నిర్వహించడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.