YCP MLA Followers Attack Woman in Anantapur: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాష్టీకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. పార్టీ అండదండలతో బడుగు, బలహీన వర్గాలపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో అవినీతిలో, భూ కబ్జాల్లో, హత్యల్లో ఇల్లా అన్ని నేరాల్లో వైసీపీ నాయకులే ముందుంటున్నారు. వారి అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలా వారి అరాచకాలపై అడిగేవారు లేక రౌడీలుగా మారి అతి సామాన్యులపై ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. తాజాగా అనంతపురంలో ఓ మహిళ తమ కాలనీ సమస్యలపై వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించగా అతని అనుచరులు ఆ మహిళ ఇంట్లోకి చొరబడి మహిళ అని చూడకుండా దాడి చేశారు.
టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్సీపీ నేతల దాడి- వీడియో వైరల్
తాగునీటి సమస్య గురించి ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అనుచరులు మహిళపై దాడి చేసిన ఘటన అనంతపురంలో కలకలం రేపింది. నగరంలోని పార్వతమ్మ కాలనీ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. 40వ డివిజన్ వైసీపీ కార్పోరేటర్ చింతకుంట మధు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డితో పాటు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళపై దాడికి తెగబడిన వైఎస్సార్సీపీ నేత - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
ఈ క్రమంలో లక్ష్మీదేవి అనే మహిళ తాగునీటి సమస్యపై ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులు ఆమె ఇంటిలోకి దూరి చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించమని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ లక్ష్మీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి మహిళల పట్ల ఎలా మాట్లాడాలో తెలీదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
ఒంటరి మహిళపై వైఎస్సార్సీపీ నాయకుల దారుణం
అయిదేళ్లయింది కుళాయిల్లేవు, మాకు తాగేందుకు నీళ్లు లేవు అని మధు అనే వ్యక్తిని అడుగుతుంటే ఈ లోగా ఎమ్మెల్యే వచ్చి మర్యాదలేకుండా మాట్లాడారు. అలా పద్దతి లేకుండా ఎమ్మెల్యే మాట్లాడే మాటలేనా? మహిళలతో ఎలా మాట్లాడాలో కూడా అతనికి తెలియదా. అప్పుడు ఎమ్మెల్యే పక్కన ఉండే వ్యక్తులు నాపై దాడి చేశారు. అక్కడి నుంచి మా సెక్రటరీ ఇంటికి వెళ్తే అక్కడకు ఇద్దరు మగవారు, ఆరుగురు ఆడవారు వచ్చి నాపై దాడి చేశారు. నాపై దాడి చేసిన వారు స్టేషన్ దగ్గరకు వచ్చి నాకు సమాధానం చెప్పాలి.- లక్ష్మీదేవి, బాధితురాలు