YCP Leaders Joining To TDP: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ వీఏఆర్కే ప్రసాద్ (అమ్మా ప్రసాద్) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఉండవల్లిలోని తన నివాసంలో వీఏఆర్కే ప్రసాద్‌కు యువనేత నారా లోకేశ్ పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. అమ్మా ప్రసాద్ వైసీపీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేశారు. వైసీపీ విధానాలు నచ్చక పార్టీకి, తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బీసీ సెల్ నగర అధ్యక్షుడు, వడ్డెరసంఘ నేత పల్లపు శివరామకృష్ణ, పాదాల మధు, అబ్ధుల్ ఖాన్, అబ్దుల్ ఖాన్, కాటమాల అశోక్, మహమ్మద్ రఫీ పార్టీలో చేరారు. వారందరికీ లోకేశ్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్నివర్గాల ప్రజలు కలసి రావాలని లోకేశ్ కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలసివచ్చే వారందరికీ తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా వస్తున్న వారి సేవలను వినియోగించుకుంటామని లోకేశ్ చెప్పారు.
సొంత బాబాయ్‌నే చంపిన వారు- వేలు కోసుకుంటే స్పందిస్తారా: లోకేశ్ - Lokesh Reaction on Kovuru Lakshmi
ఇక మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసిరావాలన్న నారా లోకేశ్ పిలుపునకు పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 100 మంది తెలుగుదేశంలో చేరారు. ఉండవల్లి గ్రామానికి చెందిన 15 మంది, తాడేపల్లి పట్టణం వైసీపీ నేతలు 50 మంది, తాడేపల్లి పట్టణం 20వ వార్డుకు చెందిన 10 మంది, మంగళగిరి రూరల్, కాజా గ్రామానికి చెందిన 10 కుటుంబాలు, దుగ్గిరాలకు చెందిన 15 మంది తెలుగుదేశంలో చేరారు. లోకేశ్ పసుపు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడకు వచ్చానని, పేదరికం లేని మంగళగిరిగా తయారుచేయడమే తన లక్ష్యమని లోకేశ్ ఉద్ఘాటించారు. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నింటిని గాడిలో పెడతాం- లోకేశ్ - Nara Lokesh Election Campaign