ETV Bharat / state

'ఫిష్ ఆంధ్ర' అన్నారు- మోడ్రన్ ఫిష్ మార్కెట్ భవనాన్ని మూలన పడేశారు - YCP Govt Neglectd Fish Markets

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 5:17 PM IST

YCP Government not Utilized Fish Market in Vijayawada : అప్పు చేసి పథకాలను ఇచ్చిన మాజీ సీఎం జగన్ నిర్వాకంతో రాష్ట్రం బీహార్ దుస్థితికి చేరిందనే విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలను నిజం చేస్తూ,వెలుగులోకి వస్తున్న ఘటనలో ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నాయి. ఫిష్ అంధ్రా అంటూ హడావిడి చేసిన జగన్, విజయవాడలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన భవనాన్ని పూర్తిగా మూలనపడేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

YCP Government not Utilized Fish Market in Vijayawada
YCP Government not Utilized Fish Market in Vijayawada (ETV Bharat)

YCP Government not Utilized Fish Market in Vijayawada : రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రభుత్వం సొమ్ము వృథాపాలు అంటే ఇదేనేమో. పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలెన్నో. అలాంటిది విజయవాడ జక్కంపూడి హౌసింగ్ కాలనీలో లక్షలాది రూపాయలతో నిర్మించిన ఆధునిక చేపల మార్కెట్​ను గత ఐదేళ్లుగా వృథాగా మార్చేశారు. దుకాణాలు కేటాయించకపోవడంతో ఆ భవనాలు వృథాగా పడిఉన్నాయి. వినియోగంలోకి తెచ్చేందుకు పట్టించుకునే నాథులే కరవయ్యారు.

ప్రభుత్వ సొమ్ము వృథాాపాలు : విజయవాడ జక్కంపూడి హౌసింగ్ కాలనీలో ప్రారంభించిన ఆధునిక చేపల మార్కెట్‌ వైెఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లుగా వినియోగంలో లేకుండా చేశారు. లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలను నిరుపయోగంగా వదిలేశారు. జక్కంపూడి హౌసింగ్ కాలనీ వాసుల సౌకర్యార్థం గతంలో చేపల మార్కెట్‌ నిర్మించగా 2017లో అప్పటి మంత్రి దేవినేని ఉమ ప్రారంభించారు. జాతీయ మత్స్య సంపద అభివృద్ధి సంస్థకు చెందిన 53 లక్షల రూపాయల నిధ‌ులతో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు మార్కెట్‌ నిర్మాణం చేపట్టారు. అధికారులు నిబంధనల ప్రకారం దుకాణాలు కేటాయించేందుకు టెండర్లు పిలిచారు. ప్రభుత్వం మారడంతో అధికారులు ఎవరూ వాటిని పట్టించుకోలేదు. దీంతో ఆధునికీకరించి నిర్మించిన మార్కెట్‌ను వృథాగా మార్చేశారు.

Pandugappa Fish: మత్స్యకారులకు పంట.. ఒక్క చేపకు భారీ ధర.. దీని రుచి మాత్రం..!

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దుకాణాల కేటాయింపు లేకపోవడంతో వాటిల్లో ఆకతాయిలు చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పిచ్చిమొక్కలు మొలిచి మార్కెట్ పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రస్తుతం కాలనీలోని ప్రధాన రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నారు. జక్కంపూడి హౌసింగ్ కాలనీలో సుమారు 20వేల మందికి పైగా ప్రజలు నివాసముంటున్నారు. కనీసం మత్స్యకారులకైనా ఆ దుకాణాలను కేటాయించినా వారు ఉపాధి పొందే అవకాశం ఉండేది. తక్షణమే భవనాన్ని వాడుకలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

వారపు సంతలో అరుదైన చేపలు - ఒక్కొక్కటి ఎంత బరువంటే ! - Huge Fish Sale at Onukudelli in aob

"వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పలువురికి ఫిష్ ఆంధ్రా పేరిట దుకాణాల కేటాయింపు చేశారు.నగరవ్యాప్తంగా అనేకచోట్ల దుకాణాలు ఏర్పాటయ్యాయి. అయితే టీడీపీ ప్రభుత్వంలో పక్కా భవనాలుగా నిర్మించిన చేపల మార్కెట్​ను మాత్రం పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రారంభించారనో, మరే ఇతర కారణాల వల్లనో దుకాణాల కేటాయింపులు జరగలేదు. మత్స్యకారులకు వీటిని ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోలేదు. కనీసం వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా భవనాలను వాడుకలోకి తీసుకురావాలి." - రాంబాబు, స్థానికుడు

లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆధునిక చేపల మార్కెట్ వృథాగా మారిన వేళ వీటిని వినియోగంలోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నగరపాలక సంస్థ అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు, కాలనీవాసులు కోరుతున్నారు.

ముక్కలు ముక్కలుగా తీరానికి కొట్టుకొచ్చిన బోటు- సుమారు ₹40 లక్షల ఆస్తి నష్టం - Fish Boat Destroyed in Visakha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.