YCP Blame TDP by Carrying Old People on Beds for Pension : రెడీ, కెమేరా, యాక్షన్ - ఇలాంటివి సినిమా షూటింగుల్లో రెగ్యులర్గా చూస్తుంటాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హైడ్రామాను పండిస్తున్నారు వైసీపీ నేతలు. ఇంటి వద్దకే పెన్షన్ తెచ్చి అధికారులు ఇస్తారని ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ ఉదయాన్నే వయసు మళ్లిన వృద్దులను, వికలాంగులను మంచాలపై మోసుకొస్తున్నారు.
వాలంటీర్లు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి లేవలేని వృద్దులను, వికలాంగులను కార్లు, ఆటోల్లో గ్రామ సచివాలయాలకు తరలించి ముందస్తుగా సిద్ధం చేసిన మంచాలపై వారిని మోసుకెళ్తునటువంటి వీడియోలను చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పెట్టి టీడీపీపై విషప్రచారం చేస్తున్నారు. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి యాక్షన్ చెప్పగానే ఇక్కడ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను పెడుతున్నారు.
ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కొంతమంది వృద్ధులను జగన్ ఫొటోతో ఉన్న పెన్షన్ పుస్తకాలను చేత్తో పట్టుకుని కెమేరా ముందు ప్రదర్శిస్తున్న దృశ్యాలను షూట్ చేసి వాటిని వెంటనే తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెడుతున్నారు. ఇదంతా టీడీపీ వాళ్లు వాలంటీర్లను ఇళ్లకు రానీయకుండా అడ్డుకోవడం వల్లే ఇలా పెన్షనర్లు నానా కష్టాలు పడుతున్నారన్నట్టుగా విషప్రచారం చేస్తున్నారు. ముందురోజు లీకైన మాజీ మంత్రి పేర్ని నాని ఆడియోలో ఈ డ్రామాకు సంబంధించిన స్క్రిప్ట్ అంతా లీక్ అయింది.
వాలంటీర్ల చేత మనమే పెన్షనర్లను సచివాలయాలకు తరలించాలని, అందుకు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులన్నీ మనమే చెల్లిద్దామని పేర్ని నాని చెప్పారు. అటు పేర్నినాని లాంటి ఉద్దండులు, ఇటు సజ్జల రామకృష్ణ లాంటి మహోద్దండుల ఆదేశాలతో రంగంలోకి దిగిన సోషల్ మీడియాకు చెందిన పలువురు ఉదయం నుంచి అదే పనిలో ఉన్నారు.
వైసీపీ వాళ్లు యాక్టింగ్ చేయించి తీయించిన వీడియోలను సోషల్ మీడియాలో పదేపదే పోస్ట్ చేస్తూ గ్రామ సచివాలయాల వద్ద తమ సిబ్బందితో వారితో మాట్లాడిస్తూ పెన్షన్ ఆపించింది టీడీపీయే కదా అంటూ వాళ్లే చెబుతూ ఆస్కార్ లెవెల్లో నాటకాన్ని పండించారు. అసలు పెన్షన్లు మేమే ఇంటికి తెచ్చి ఇస్తామని చెబుతుంటే మీరందరూ ఎండలో ఇక్కడి దాకా ఎందుకు వచ్చారని అధికారులు పెన్షనర్లను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు సచివాలయాల వద్ద మంచాల మీద పెన్షనర్లను మోసుకొచ్చే సీన్లు, కొంతమంది చేసే యాక్టింగ్ అంతా చూసి నవ్వుకుంటున్నారు సచివాలయ సిబ్బంది.
గత వారం రోజులుగా విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లోనే బస చేసిన ఓ వ్యక్తి ఈ డ్రామా అంతా నడిపిస్తున్నాడట. సోషల్ మీడియాకు ఈ డ్రామా స్క్రిప్ట్ పంపి టీడీపీని దెబ్బతీసేందుకు తీవ్ర స్థాయిలో కుట్ర చేశాడట. నాలుగు రోజుల క్రితం సీఎం జగన్ను రహస్యంగా కలిసిన ఈయన ఇన్నాళ్లు తీసుకున్న డబ్బులకు రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చాడట.
ఈ రెండు నెలల పాటు తన తప్పుడు కథనాలతో టీడీపీని దెబ్బతీస్తానని హామీ ఇచ్చాడట. సచివాలయాల వద్ద పెన్షనర్ల కష్టాలు లాంటి కథనాలతో పాటు ఇంకా చాలా స్టోరీలు నడిపిస్తానని చెప్పాడట. ఇలా డ్రామా కథనాలు నడిపినందుకు మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే. రాజ్యసభ ఎంపీ కావాలని అడుగుతున్నాడట. నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీ బతుకంతా బట్టబయలవుతుంది జాగ్రత్త అంటూ టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.