ETV Bharat / state

యాదాద్రిపై సర్కార్ ఫోకస్ - కొండపైకి వ్యక్తిగత వాహనాల అనుమతిపై పునరాలోచన - Yadadri Temple facilities

Yadadri Temple Facilities : తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయంపై ఫోకస్ పెట్టింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మరింత దృష్టి సారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తీసుకోవాల్సిన కసరత్తు చేపడుతోంది. అలాగే కొండపైకి వ్యక్తిగత వాహనాల అనుమతిపై కూడా పునరాలోచన చేస్తోంది.

Yadadri Temple
Yadadri Temple
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 10:57 AM IST

Yadadri Temple Facilities : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి (Yadadri Lakshmi Narasimha Swamy Temple) ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను రూపొందించేందుకు సమాయత్తం అవుతోంది.

కొన్ని సౌకర్యాల విషయంలో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిపై అధ్యయనం చేయించాలంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వద్దకు ప్రతిపాదనలు వచ్చాయి. త్వరలోనే మంత్రి ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతరం అధ్యయనానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Yadadri Lakshmi Narasimha Swamy Temple : మరోవైపు సదుపాయాలపై భక్తుల నుంచి స్పందన (ఫీడ్‌బ్యాక్‌)ను ఏవిధంగా తీసుకుందామన్న అంశంపై అధికారులు మేదోమథనం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా కియోస్క్‌లను ఏర్పాటు చేయడమా? ఆన్‌లైన్‌ ద్వారా స్పందనను నమోదు చేయడమా? అన్న అంశాలపై త్వరలో స్పష్టత రానున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌ ద్వారా భక్తుల స్పందనను తెలుసుకునే విధానం ఇప్పటివరకు లేదు. ఈ విధానాన్ని అమలుచేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చిరుజల్లుల్లో యాదాద్రి ఆలయం.. ఎంత అద్భుతంగా ఉందో..?

సొంత వాహనాలపై కింకర్తవ్యం : యాదాద్రి (Yadadri Temple) కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ మినీ బస్సులతోపాటు వ్యక్తిగత వాహనాలను అనుమతిస్తున్నారు. రూ.500 చెల్లిస్తే వ్యక్తిగత వాహనాలను పైకి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుతం సగటున రోజుకు 500-600 వ్యక్తిగత వాహనాలు కొండపైకి వెళుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్‌లో పార్కింగ్‌ సమస్య రావడంతోపాటు కొండపైన కాలుష్యం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Telangana Govt on Yadadri Temple : వ్యక్తిగత వాహనాలను ఇప్పటినుంచే నియంత్రించకపోతే రానున్న రోజుల్లో మరింత కష్టం అవుతుందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. కొండ కిందే పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పించాలన్న సూచనలు అధికారులకు వస్తున్నాయి. ప్రస్తుతం వ్యక్తిగత వాహనాలను పైకి అనుమతించడం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. నియంత్రించడం ద్వారా ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఉన్నప్పటికీ కాలుష్యాన్ని, వాహనరద్దీని నియంత్రించేందుకు అంతకుమించిన మార్గం లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Thousands of Folk Bhajan Devotees In Yadadri : హరినామ సంకీర్తనలతో ప్రతిధ్వనించిన యాదాద్రి

బస్సుల సంఖ్యను పెంచడం ఒక మార్గంగా అధికారులు సూచిస్తున్నారు. తిరుమల, విజయవాడ ఇంద్రకీలాద్రి తరహాలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ పెద్ద సంఖ్యలో విద్యుత్‌ బస్సులను సమకూర్చుకోనుంది. వాటిని కొండపైకి నడిపేందుకు సాధ్యాసాధ్యాలపై ఆర్టీసీ ద్వారా అధ్యయనం చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ మినీ బస్సులను నడుపుతోంది. పెద్ద బస్సులను నడిపేందుకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్న విషయాన్ని ఆ సంస్థ అధికారుల నుంచి సేకరించాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

యాదాద్రి దర్శన టికెట్లు ఇకపై ఆన్​లైన్​లో.. వాటి ధరలు మీకు తెలుసా..!

యాదాద్రిలో పోటెత్తిన భక్తులు.. కళకళలాడిన ఆలయ పరిసరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.