ETV Bharat / state

శిక్ష పడుతుందనే భయంలేకనే - ఆడవాళ్లపై అఘాయిత్యాలా? - Women Rape Cases In Telangana - WOMEN RAPE CASES IN TELANGANA

Women Rape Cases in Telangana : కోలకతా డాక్టర్‌ హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. నిర్భయ, దిశ ఘటన కారణంగా చట్టాల సంస్కరణలు చేపట్టినప్పటికి కేసుల తగ్గుదలలో ఎలాంటి మార్పులు జరగడం లేదు. ఒక పక్క కేసులో అరెస్టు అవుతున్నా కొన్ని కేసులు కొట్టివేయడంతో బయటకు వస్తున్నారు. సంచలనం సృష్టించిన కేసులైనా శిక్షలు పేలవంగా ఉండడంతో సర్వాత్ర విమర్శలు వస్తున్నాయి. కోలకతా ఘటన నేపథ్యంలో తెలంగాణలో సంచనం రేపిన ఆయా కేసులపై కథనం.

Women Rape Cases in Telangana
Women Rape Cases in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 3:18 PM IST

Women Rape Cases in Telangana : మహిళలపై అత్యాచారాలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. మరోవైపు ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో మూడొంతుల మంది నిర్దోషులుగా విడుదలవుతున్నారు. హీనమైన ఈ నేరాల్లో శిక్షలు అరకొరగా ఉంటుండడంపై సర్వాత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనపై దేశం అట్టుడుకుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆయా కేసులపై పరిశీలన కథనం.

  • జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2022 సంవత్సరంలో 2,293, 2023లో 2,284 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.
  • తెలంగాణలో 2022లో కోర్టుల్లో విచారణ పూర్తయినవి కేసులు 609.

అత్యాచారం కేసుల్లో శిక్షలు పడగా 4,486 కేసులను కొట్టేశారు. మహిళలపై నేరాలను అరికట్టడానికి రాష్ట్రంలో చేపట్టిన అనేక చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నప్పటికి అత్యాచార నిందితులకు శిక్షల విషయంలో పరిస్థితి పేలవంగా ఉందని ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి.

  • 2023లో రాష్ట్రంలో నమోదైన అత్యాచారం కేసుల్లో 69.18 శాతం మంది పెళ్లి చేసుకుంటామని మభ్యపెట్టి లైంగిక చర్యకు పాల్పడ్డవారే.
  • 13.44 శాతం కేసుల్లో ఇంటి చుట్టుపక్కల ఉండేవారు.
  • 6.44 శాతం కేసుల్లో బంధువులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
  • 0.26 శాతం కేసుల్లో బాధితులకు పూర్వ పరిచయం లేనివారు ఈ దురాగతానికి ఒడిగట్టారు.
  • 10.68 శాతం కేసుల్లో ఇతరులు నిందితులుగా ఉన్నారు.

ప్రస్తుతం కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం, గతంలో హైదరాబాద్‌లో ‘దిశ’ ఉదంతం, అంతకుముందు దిల్లీలో ‘నిర్భయ’ వంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు, ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు చేపట్టడం షరామాములైంది. నిర్భయ ఘటన తర్వాత మహిళలపై నేరాలకు సంబంధించిన చట్టాలను సంస్కరించారు. నిర్భయ ఫండ్‌ పేరిట అన్ని రాష్ట్రాలకు పత్యేకంగా నిధులిస్తున్నారు.

సిద్దిపేటలో దారుణం - ఆడిస్తానని తీసుకెళ్లి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం - Three Year old Girl Raped

తెలంగాణను అనుసరించి అనేక రాష్ట్రాలు : మరోవైపు తెలంగాణ ఏర్పాడ్డాక మహిళల భద్రతకు అనేక చర్యలు చేపట్టారు. మహిళల కోసం ప్రత్యేకంగా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసి, అదనపు డీజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ‘షి’ టీమ్‌లను దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరించాయి. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు సహాయసహకారాలు అందిస్తున్నారు. మహిళల భద్రతా కోసం ఇన్ని చర్యలు చేపట్టినా అత్యాచారం కేసుల్లో పెద్దగా తగ్గుదల కనిపించడకపోవడం ఆందోళన కలిగించే విషయం.

అత్యాచారం కేసు గురించి సరైన సమయంలో ఫిర్యాదు చేస్తే డీఎన్‌ఏ వంటి శాస్త్రీయ ఆధారాలు సేకరించవచ్చు. నేరం నిరూపించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్తాయి. దాంతోపాటు బాధితురాలి వాంగ్మూలం ఉంటే కేసు ముందుకెళ్లినట్లే. అయితే న్యాయవిచారణ సమయంలో సాక్షులు ఎదురుతిరగడం, బాధితులు తమ వాంగ్మూలం ఉపసంహరించుకోవడం కేసుల కొట్టివేతకు కారణాలు.

బాధితులకు కౌన్సిలింగ్‌ ఇచ్చే దిశగా : ఈ కేసుల్లో దాదాపు 90 శాతం మంది బాధితులకు ఏదోవిధంగా తెలిసినవారే ఉండటం గమనార్హం. ఈ దారుణాలపై వారు ఫిర్యాదు చేసినప్పటికీ కొంతకాలం తర్వాత స్నేహితులు, బంధువులు సర్దిచెబుతుండటంతో బాధితులు పునరాలోచనలో పడుతున్నారని, న్యాయవిచారణ సమయంలో తమ వాదన మీద గట్టిగా నిలబడటంలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షులను కూడా ప్రభావితం చేస్తున్నారని, కేసులు కొట్టేయడానికి ఇవే ప్రధాన కారణాలని వివరిస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారం కేసుల్లో తమ వాదనకు కట్టుబడి ఉండేలా బాధితులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. నిందితులందరికీ శిక్షలు పడేలా చూసేందుకు కృషి చేస్తున్నట్లు తెలుపుతున్నారు.

151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై మహిళల్ని వేధించారని కేసులు- 16మందిపై అత్యాచారం ఆరోపణలు! - Criminal Cases On MLAs And MPs

ఫేస్​బుక్​లో పరిచయం - పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం - ఆపై ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.