ETV Bharat / state

ఆ సీన్ ఎందుకు చేశావ్! - లవ్​ రెడ్డి సినిమా నటుడిని చితకబాదిన మహిళ - ATTACK ON LOVE REDDY FILM ACTOR

లవ్​ రెడ్డి చిత్రాన్ని చూసి భావోద్వేగానికి గురైన మహిళ - చిత్రంలో నటించిన ఎన్టీ రామస్వామిపై దాడి - ప్రేమజంటను విడదీస్తావా అంటూ ఆగ్రహం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2024, 9:13 AM IST

Woman Attacks Love Reddy film Actor N T Ramaswamy : ఇటీవల విడుదలైన లవ్ రెడ్డి చిత్ర బృందానికి ఇవాళ అనూహ్య స్పందన ఎదురైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్ చూసేందుకు ఇవాళ హైదరాబాద్ నిజాంపేట్​లోని ఓ మల్టీప్లెక్స్​కు వెళ్లారు. చిత్రం అనంతరం మూవీ టీమ్ ప్రేక్షకులతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఓ మహిళ చిత్రంలో నటించిన నటుడు ఎన్టీ రామస్వామిపై దాడి చేసింది. లవ్ రెడ్డి చిత్ర పతాక సన్నివేశాలు చూసి భావోద్వేగానికి గురైన ఆ మహిళ ప్రేమజంటను విడదీస్తావా అంటూ కోపంతో రామస్వామి కాలర్ పట్టుకొని దుర్భాషలాడింది.

నిర్ఘాంతపోయిన చిత్ర బృందం : అనూహ్యంగా జరిగిన ఈ దాడితో చిత్ర బృందం నిర్ఘాంతపోయింది. వెంటనే హీరో అంజన్, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి ఆ మహిళను అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనా మరింత కోపంతో ఆ మహిళ రామస్వామిపై దాడికి దిగే ప్రయత్నం చేసింది. ఆ మహిళ వెంట వచ్చిన వారు, ఇతర ప్రేక్షకులు ఆమెకు సర్దిచెప్పడంతో శాంతించింది. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. ఈనెల 18న విడుదలైన లవ్ రెడ్డి చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా నటించారు.

8 నెలల క్రితం చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమ! - ఈ వారం థియేటర్/OTT సినిమాలివే

జొమాటో సీఈఓకు చేదు అనుభవం- మాల్ లిఫ్ట్​లోకి అనుమతించని స్టాఫ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.