Wines Shops Closed : తెలంగాణలో మందు బాబులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మళ్లీ వైన్స్ షాపులు మూత పడనున్నాయి. ఈ నెలలోనే రెండోసారి మద్యం షాపులు బంద్ కానున్నాయి. మే 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 2 రోజులపాటు వైన్ షాపులు, బార్లు మూతపడగా తాజాగా మరో రెండు రోజులు వైన్స్ షాప్స్ మూతపడనున్నాయి. మరి, ఎక్కడెక్కడ మూత పడనున్నాయి? దీనికి గల కారణాలేంటి? మళ్లీ మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తారు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలో మే 27న (సోమవారం) నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వైన్స్ షాపులు, బార్లు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని వైన్స్ షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. మే 27న పోలింగ్ జరగనుండగా ముందు నుంచే బంద్ పాటించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలతోపాటు అన్ని కల్లు కంపౌండ్‌లు సైతం 48 గంటల పాటు మూతపడనున్నాయి.
అడ్డగోలుగా జే బ్రాండ్ల మద్యం విక్రయాలు - పోతున్న ప్రాణాలు - YSRCP Supplying Deadly J Brand
ఆ మూడు జిల్లాల్లోనే : మే 25వ తేదీన శనివారం సాయంత్రం 4 గంటల నుంచి మూసివేత నిర్ణయం అమలు కానుంది. తిరిగి మే 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు మద్యం షాపులు ఓపెన్ కానున్నాయి. అయితే ఈ బంద్ రాష్ట్రం మొత్తం కాదు. ఎన్నికలు జరుగుతున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వైన్ షాపులను మాత్రమే బంద్ చేయనున్నారు. ఆ జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజైన జూన్ 4న కూడా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.
వరుస బంద్‌లు.. మందు బాబులకు వరుస బంద్‌లు షాకిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసేశారు. మే నెలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరుసగా రెండు రోజులు మూత పడ్డాయి. మళ్లీ ఇప్పుడు మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు బంద్ కానున్నాయి. అటు జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున కూడా మూసివేయనున్నారు. ఇలా వరుసగా షాకుల మీద షాకులు తగులుతుండడంతో మద్యం ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ మేడ్, గోవా సీల్ కల్తీ మద్యం- 'ఓటేసి చావు' అన్నట్లు వైఎస్సార్సీపీ కృూరత్వం - GOA LIQUOR