ETV Bharat / state

ఫుల్ సరుకుతో మందుబాబులు రెడీ - ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డారుగా! - Wine Shops Closed in Andhra Pradesh - WINE SHOPS CLOSED IN ANDHRA PRADESH

Wine Shops Closed in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​లో మందుబాబులు ముందుగానే మేల్కొన్నారు. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అని తెలుసుకున్న వారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. టైమ్ వేస్ట్ చేస్తూ ఇంట్లో కూర్చుంటే లాభం లేదనుకున్నారు. అనుకున్నదే తడవుగా దుకాణాల వద్ద బారులు తీరారు. ఎంత పొడవాటి లైన్లు ఉన్నాసరే వారి ఉక్కు సంకల్పం ముందు అవేవీ పని చేయలేదు. తమకు కావలసినంత సరుకును ముందుగానే తెచ్చిపెట్టుకున్నారు.

Wine Shops Closed
Wine Shops Closed (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 12:05 PM IST

Wine Shops Closed in Andhra Pradesh: మందుబాబులకు ఒక్కరోజు చుక్క లేకపోయినా ఏదో కోల్పోయినట్లే అనిపిస్తుంది. అలాంటిది ప్రభుత్వం వారికి భారీ షాక్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏకంగా మూడు రోజులు దుకాణాలు ఉండవు అంటూ బాంబు పేల్చింది. అయినా సరే మందు బాబులు జంకలేదు. మమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటూ తమలో తామే అనుకున్నట్లు ఉన్నారు. అందుకే జీవితంలో ముందుచూపు అవసరం అనుకుని, ముందుగానే తమకు కావలసినంత సరుకు తీసుకొచ్చేయాలని నిర్ణయించుకున్నారు.

మద్యం దుకాణాలు వద్దకు పరుగులు తీశారు. అయితే వారికి అక్కడ మరో ఊహించని పరిస్థితి ఎదురైంది. ఒక గూటి పక్షులు అన్నీ ఒక దగ్గరకి చేరినట్లు అప్పటికే అక్కడ భారీగా తమ కోవకు చెందిన వారు ఉన్నారు. అంతా ఆ చుక్క కోసమే వచ్చారు. ఇక చేసేదేం ఉంది అనుకుంటూ, ఎంత భారీగా లైన్లు ఉన్నా సరే సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ముందుకు కదిలారు. ఎంతో సమయం వేచి ఉన్న తరువాత, తమకు కావలసినంత సరకు రావడంతో, జీవితంలో మరో గొప్ప విజయం సాధించామంటూ సంతోషంపడ్డారు. ఆ సంతోషాన్ని తమ తోటివారితోనూ పంచుకున్నారు.

మందుబాబుల మందు చూపు- మద్యం దుకాణాల వద్ద బారులు! - Huge Crowd at Wine Shops

LIQUOR SHOPS BANDH CLOSED DAYS: కాగా రాష్ట్రంలో మద్యం షాపులు మూతపడ్డాయి. ఓట్ల లెక్కింపు ముగిసేంత వరకు తెరచుకోవు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ రోజు ‘డ్రై డే’గా పరిగణించాలని పేర్కొంది. అయితే స్థానిక పరిస్థితులు, శాంతిభద్రతల రీత్యా కొన్ని జిల్లాల్లో 3, 4, 5వ తేదీల్లో మద్యం దుకాణాల మూసివేతకు అక్కడి కలెక్టర్లు ఆదేశాలిచ్చారు.

ఫలితాల తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే కొంతకాలంగా మందు బాబులకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. పలు కారణాలతో మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతోంది. బార్​లు, మద్యం షాపులు మూతపడనున్నాయని తెలియడంతో ఈసారి మందుబాబులు ముందుగానే జాగ్రత్తపడ్డారు.

Huge Crowd at Wine Shops: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాల వద్ద మందు ప్రియులు బారులు తీరారు. సోమవారం నుంచి బుధవారం వరకూ మద్యం దుకాణాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు చేయకూడదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచే మద్యం దుకాణాలు మూసివేశారు. తిరిగి 6వ తేదీన ఉదయం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. దీంతో ముందుగానే మద్యం సీసాలు విక్రయించి తమ ఇళ్ల వద్ద స్టాక్ పెట్టుకునేందుకు దుకాణాల వద్ద మందుబాబు ఎగబడ్డారు.

మందుబాబులకు షాకుల మీద షాకులు - రెండు రోజులు వైన్స్​ బంద్ - Wines Shops Closed In Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.