ETV Bharat / state

ఊరంతా అప్పులు, ఆపై వేధింపులు - తట్టుకోలేక మహిళ ఆత్మహత్య - Wife Commits Suicide Issue - WIFE COMMITS SUICIDE ISSUE

Wife Commits Suicide Issue: భర్త అప్పులు చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పులిచ్చివారు బకాయిలు చెల్లించాలని భార్యపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో పోలీస్ స్టేషన్ ఆవరణలో భార్య ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందింది.

Wife_Commits_Suicide_Issue
Wife_Commits_Suicide_Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 2:46 PM IST

Wife Commits Suicide Issue: భర్త అప్పులు చేసి మోసానికి పాల్పడి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయాడన్న బాధ ఓ వైపు. అప్పిచ్చినవారు బకాయిలు చెల్లించాలని తీవ్ర ఒత్తిడిలు మరోవైపు. ఈ విషయమై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్సై సైతం పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ హృదయవిదారక ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే: బాపట్లలో వెదులపల్లి వడ్డెర కాలనీకి చెందిన శోభారాణికి కారంచేడు మండలం కుంకుల మర్రకు చెందిన వెంకటరావుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వెంకట్రావుకు శోభారాణితో ఇది రెండో వివాహం. మొదటి భార్యకు ఇద్దరు సంతానం. అయితే ఆమె చనిపోవటంతో శోభారాణిని అతడు రెండో వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం గ్రామంలో భర్త కోసం రెండు లక్షల రూపాయలకు పైగా అప్పులు చేసింది.

నగదు వాడుకున్న తర్వాత భార్యను వెంకట్రావు వేధింపులకు గురి చేశాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం ఎద్దులపల్లిలోని పుట్టింటికి శోభారాణి వచ్చింది. చేసిన అప్పు వడ్డీలతో సహా మూడు లక్షల పైగా చేరుకోవడంతో ఇచ్చిన వారు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల భర్త వెంకట్రావు ఆటో గ్రామానికి తీసుకుని రాగా విషయం తెలిసి వాహనాన్ని తీసుకెళ్లి ఎద్దులపల్లి పోలీసులకు అప్పజెప్పింది. భర్త 2 లక్షలకు పైగా అప్పులు తీసుకుని ఎగ్గొట్టాడని, బకాయిలు చెల్లించే వరకూ వాహనాన్ని విడిచిపెట్టొద్దని ఎస్సై అజితను కోరింది.

8 నెలల పసికందును నీటితొట్టెలో పడేసి తల్లి ఆత్మహత్య - Mother Commits Suicide With Child

అయితే అందుకు ఎస్సై నిరాకరించి ఆటోను వెంకట్రావుకు తిరిగిచ్చేయటంతో ఆవేదనకు గురైన శోభారాణి గత శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్​ ఆవరణంలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆమెను బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స మేరకు జీజీహెచ్​కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.

పోస్టుమార్టం అనంతరం శోభారాణి మృతదేహాన్ని గురువారం రాత్రి వేదుర్లపల్లి తరలించారు. ఈ ఘటనలో మృతురాలి బంధువులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్​ వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి తల్లి రమణమ్మకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే పట్టణ సీఐ హజరత్ బాబు, గ్రామీణ సీఐ శ్రీహరి శ్రీనివాసులు, ఎస్ఐ సుధాకర్ హుటాహుటిన ఘటన స్థలాన్ని చేరుకొని ఆందోళనకారులతో చర్చించి ధర్నా విరమింపజేశారు. వెంకట్రావుతో పాటు ఎస్సై అజితపై మృతురాలి తల్లి రమణమ్మ బాపట్ల గ్రామీణ సిఐ శ్రీహరికి ఫిర్యాదు చేశారు.

భార్యను కొట్టిన భర్త- భయంతో కాసేపటికే ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.