ETV Bharat / state

ఒక కేసులో అరెస్టొద్దంటే మొత్తానికే వదిలేస్తారా?- పిన్నెల్లిపై పోలీసుల స్వామిభక్తి - PINNELLI CASES - PINNELLI CASES

Macherla MLA Pinnelli Ramakrishna Reddy : మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు ? కారంపూడి సీఐపై దాడి చేసి గాయపరిచినా పోలీసులు అసాధారణ సంయమనం ఎందుకు పాటిస్తున్నారు? ఇది పోలీసుల చేతగానితనమా లేక వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో వ్యవహరిస్తున్నట్టుగా ఎక్కడా లేని భక్తిప్రపత్తులు ప్రదర్శిస్తున్నారా? ఇవి ఇప్పుడు జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదుల్లో తలెత్తుతున్న ప్రశ్నలు.

Pinnelli EVM Damage Case
Macherla MLA Pinnelli Ramakrishna Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 1:06 PM IST

Macherla MLA Pinnelli Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్​లో డీజీపీ మారినా అధికార పార్టీ నాయకులపై పోలీసుల స్వామిభక్తిలో ఎలాంటి మార్పూ రాలేదనడానికి పిన్నెల్లి ఉదంతమే నిదర్శనం. ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. దానిపై రెంటచింతల పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో 15 మందిపై సెక్షన్‌ 307, 147, 148, 120బీ, 324, రెడ్‌విత్‌ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణారెడ్డిని ఏ-1గా పెట్టారు. పోలింగ్‌ మరుసటిరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు.

Pinnelli EVM Damage Case : వందల మంది రౌడీమూకలతో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ సానుభూతిపరులపై విరుచుకుపడి, ఆస్తులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, మరికొందరిపై ఐపీసీ 307, 332, 143, 147, 324, 149 సెక్షన్ల కింద కింద ఈ నెల 14వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఒక సీఐని దారుణంగా కొట్టి గాయపరిచినా ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్‌ చేయలేదు.

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాత్రమే పిన్నెల్లిని వచ్చే నెల 6 వరకు అరెస్ట్‌ చేయవద్దని హైకోర్టు చెప్పింది. హత్యాయత్నం నేరం కింద ఐపీసీ సెక్షన్‌ 307 కింద ఎమ్మెల్యేను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ దాఖలైన కేసుల్లో ఆయన్ను అరెస్ట్‌ చేయవద్దని చెప్పలేదు. ఈవీఎం ధ్వంసం కంటే హత్యాయత్నం తీవ్రమైన నేరమైనప్పుడు ఆయన్ను వెంటనే ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు? ఎమ్మెల్యేపై సెక్షన్‌ 307 కింద రెండు కేసులు నమోదైనా అరెస్ట్ చేయకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

'చంపెయ్యండ్రా' అంటూ కత్తులతో దాడి : పోలింగ్‌ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బూత్‌లోకి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టారని తాను అడ్డుకోబోతే వేలు చూపించి బెదిరిస్తూ పరుష పదజాలంతో దూషిస్తూ 'చంపెయ్యండ్రా' అంటూ హూంకరించారని నంబూరి శేషగిరిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు చింతా సుబ్బారావు, మరికొందరు కర్రలు, రాడ్లతో, కత్తులతో తనపై దాడి చేశారని తీవ్రంగా గాయపడ్డ తాను అక్కడే కిందపడిపోగా చచ్చాడులేరా అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వెళ్లిపోయారని ఫిర్యాదులో తెలిపారు. అనంతరం బంధువుల సాయంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నానని స్పష్టం చేశారు.

ఇంత పక్కాగా ఆధారాలు, ఫిర్యాదులున్నా పోలీసులు ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు? ప్రజాప్రతినిధినని మర్చిపోయి ఒక రౌడీలా వ్యవహరించిన ఆయనపై పోలీసులకు ఎందుకంత మమకారం? ఒకప్పుడు పోలీసింగ్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఇప్పుడెందుకంత నీరుగారిపోయారు? సీఐని కొట్టినట్టు మిగతా పోలీసుల్నీ కొడతారేమోనన్న భయమా? అపారమైన భక్తి ప్రపత్తులా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాల్వాయిగేటులో ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీయగా ఆమెను తీవ్రంగా హెచ్చరిస్తూ దుర్భాషలాడారు. దీనిపై ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు సమాచారం : పల్నాడు జిల్లాలోని పోలీసుల్లో అత్యధికులు వైఎస్సార్సీపీ నాయకులకు వేగుల్లా పని చేస్తున్నారని ఇటీవల ఒక పోలీసు ఉన్నతాధికారి వాపోయారు. పిన్నెల్లి కోసం గాలిస్తున్న పోలీసు బృందాల్లోని కొందరు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు చేరవేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం నుంచి పోలీసు బృందాలు బయల్దేరగానే ఆ సమాచారం పిన్నెల్లికి చేరిపోయిందని, ఈ బృందాలకు సారథ్యం వహిస్తున్న అధికారికి సభ్యులు ఏ మాత్రం సహకరించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

పిన్నెల్లి ఈ నెల 22న హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ పారిపోయేందుకు విమాన టిక్కెట్‌ కొన్నారు. ఆ విషయాన్ని పిన్నెల్లిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన బృందాలకు పల్నాడు జిల్లా నుంచి ఒక పోలీసు అధికారి ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే ఈ విషయం పిన్నెల్లికి చేరిపోవడంతో ఆయన విమానాశ్రయానికి వెళ్లలేదని చెబుతున్నారు.

ఒక కేసులో అరెస్టొద్దంటే మొత్తానికే వదిలేస్తారా?- పిన్నెల్లిపై పోలీసుల స్వామిభక్తి (ETV Bharat)

సిగ్గులేదారా? టీడీపీ ఏజెంట్లను బయటకు పంపండి'- 'ఏఎస్​ఐకి వార్నింగ్'- పిన్నెల్లి పర్వంలో దాగిన అరాచకాలెన్నో? - AP YSRCP Leaders Anarchy

'పులిరా పులిరా పెద్ద పులిరా, ఈవీఎంలు పగలగొట్టి పిల్లిలా పారిపోయేరా' - పిన్నెల్లిపై నెట్టింట్లో ట్రోల్స్ - Trolls Viral on MLA Pinnelli

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.