ETV Bharat / state

హైడ్రాకు జై' కొడుతున్న జనం - మాకూ కావాలంటున్న జిల్లాలు - WE WANT HYDRA IN OUR DISTRICTS - WE WANT HYDRA IN OUR DISTRICTS

Huge Support To Hydra Demolitions : హైదరాబాద్‌ మహానగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. భవిష్యత్‌ తరాల కోసం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి మద్దతుగా లేఖలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కొందరు విపక్ష నేతల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ అటు ప్రజలతో పాటు కాంగ్రెస్‌, తదితర పార్టీల నేతలు సైతం అండగా నిలుస్తున్నారు. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

Huge Support To Hydra Demolitions
Huge Support To Hydra Demolitions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 1:13 PM IST

హైడ్రాకు జై' కొడుతున్న జనం - మాకూ కావాలంటున్న జిల్లాలు (ETV Bharat)

Political Leaders Supporting HYDRA Demolitions : హైదరాబాద్‌లో వర్షం పడితే చాలు రహదారులన్నీ జలమయం అవుతాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. లోతట్టు ప్రాంతాలకు వరద పోటెత్తుతోంది. వందలాది చెరువులు ఆక్రమణకు గురికావడమే ఇందుకు కారణమనే భావన చాలా కాలం నుంచి ఉంది. ఈ సమస్యపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ సర్కార్‌ ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. ఐజీ రంగనాథ్‌ హైడ్రాకు కమిషనర్‌గా వ్యహరిస్తుండగా 3వేల 500ల మంది వరకు అధికారులు, సిబ్బంది కావాలని ప్రతిపాదన పంపారు.

తాత్కాలికంగా కొందరిని కేటాయించిన సర్కార్‌ క్రమంగా పూర్తిస్థాయిలో సిబ్బందిని ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఉన్న సిబ్బందితో పాటు, రెవెన్యూ, పోలీసు, జీహెచ్​ఎంసీ విభాగాల యంత్రాగం సహాయంతో ఆక్రమణలపై రంగనాథ్‌ ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజాశ్రేయస్సు, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్​లో హైడ్రా హడల్ - అక్రమ నిర్మాణాలపై ముప్పేట దాడి - HYDRA DEMOLITIONS

పార్టీలకు అతీతంగా ప్రశంసలు : నీటివనరుల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి సారించిన హైడ్రా ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పార్టీలకతీతంగా హైడ్రా పనితీరును ప్రశంసిస్తున్నారు. మరోవైపు హైడ్రాకు అధికార కాంగ్రెస్‌ నుంచి సైతం మద్దతు పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో హైడ్రాను బలోపేతం చేయాలని కోరుతున్నారు.

"చెరువు కబ్జా చేస్తే వదలకండి. ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ముందు రాజకీయ కక్షతో ప్లాన్ చేస్తున్నారనుకున్నాం. కానీ హైడ్రా పనితీరు చూస్తుంటే పక్షపాతం కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు ప్రకటిస్తున్నాను. ఆక్రమణకు గురైన భూమిని తీసుకుని దాన్ని డెవలెప్ చేసే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది." - రాజకీయ నేతలు

హైడ్రాను జిల్లాలకు విస్తరించాలంటూ కాంగ్రెస్‌ నేతలు సీఎంకు లేఖలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యేలు, మంత్రులు అభివర్ణిస్తున్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండాపార్టీలకు అతీతంగా ఆక్రమణదారులపై చర్యలుంటాయని ఇటీవలే సీఎం స్పష్టం చేశారు. ఆ దిశలో ముందుకు వెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం త్వరలోనే హైడ్రాకు పూర్తి యంత్రాంగాన్ని ఇచ్చేలా కసరత్తు చేస్తోంది.

'హైడ్రా' నివేదికలో ప్రముఖులకు చెందిన నిర్మాణాలు- జాబితాలో ఎవరెవరివి ఉన్నాయంటే? - HYDRA REPORT ON DEMOLITIONS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.