ETV Bharat / state

పనికిరాని మొక్కలతో రూ.లక్షల్లో ఆదాయం - కుటీర పరిశ్రమ నెలకొల్పి మహిళలకు ఉపాధి - Water Hyacinth Products

Water Hyacinth Products in Hyderabad : మీకు గుర్రపు డెక్క గురించి తెలుసా? దానితో లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చని ఎప్పుడైనా అనుకున్నారా? సహజంగా ఈ మొక్క అంటే ఎందుకు పనికి రాని కలుపు మొక్కగా భావిస్తారు. కాని ఆ యువకుడు వినూత్నంగా ఆలోచించి ఇదే మొక్కతో వ్యాపారం చేస్తున్నాడు. లక్షలో ఆదాయం సంపాదించడంతో పాటు అనేక మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు? ఏంటి అతను చేస్తున్న వ్యాపారం. పనికి రాని మొక్కతో లక్షల్లో సంపాదన ఎలా ఆర్జిస్తున్నాడో ఈ కథనంలో చూద్దాం.

Allika Founder Abdul Mujeeb Shaik Achievement
Handwoven Products From Water Hyacinth
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 1:56 PM IST

పనికిరాని మొక్కలతో రూ.లక్షల్లో ఆదాయం - కుటీర పరిశ్రమ నెలకొల్పి మహిళలకు ఉపాధి

Water Hyacinth Products in Hyderabad : అందరిలా ఆలోచిస్తే గుంపులో గోవిందలా ఉంటాం. అదే వినూత్నంగా ఆలోచిస్తే ఎంత మందిలో ఉన్నా గుర్తింపు తెచ్చుకుంటాం. ఇదే సూక్తిని నమ్మాడు ఈ యువకుడు. వ్యాపార రంగంలో రాణించి పేరు ప్రఖ్యాతలు సాధించాలని చిన్నతనం నుంచే తపనతో ఉండేవాడు. తన కలను సాకారం చేసుకునే ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నాడు. ఆ అనుభవాలతోనే గుర్రపు డెక్కలతో వస్తువులు తయారుచేస్తూ ఔరా అనిపిస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టి పెరిగిన అబ్దుల్ ముజీబ్, ఉన్నత విద్యా, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత కొన్ని స్టార్టప్‌లను(Start-ups) ప్రారంభించాడు. కానీ, వాటిలో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయినా ఎప్పుడు వెనకడుగు వేయకుండా తన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాడు. కేవలం సంపాదన మాత్రమే కాదు, తన వ్యాపారం పర్యావరణహితంగా ఉండాలనుకున్నాడు ముజీబ్‌.

Allika Founder Abdul Mujeeb Shaik Achievement : పనికిరాని గుర్రపు డెక్కను కుటీర పరిశ్రమకు ముడిసరుకుగా వాడి, మంచి ఆదాయం అర్జించే వ్యాపారానికి నాంది పలికాడు. 2014 అక్టోబర్‌లో అల్లిక సంస్థను ఏర్పాటు చేసి ప్రకృతి సిద్ధమైన వస్తువులను(Natural Products) తయారుచేస్తున్నాడు. సుమారు 250 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఒక్కడిగా మొదలు పెట్టిన వ్యాపారం నేడు వందల మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతోంది.

"సాధారణంగా గుర్రుపుడెక్క నీళ్లలో విస్తృతంగా పెరిగి, సమస్యగా మారుతాది. ప్రభుత్వాలు సైతం వీటిని చెరువులనుంచి తొలగించడానికి కొన్ని కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. గతకొన్ని దశాబ్దాలుగా, వీటి శాశ్వత నిర్మూలనకు కృషి చేస్తున్నారు కానీ సాధ్యపడటంలేదు. అటువంటి దానిని మేము ఓ చిన్న ఆలోచనతో పర్యావరణహితమైన వస్తువుల తయారీకి వాడుకుంటున్నాం."-అబ్దుల్ ముజీబ్, అల్లిక సంస్థ నిర్వాహకుడు

ఏరో స్పేస్‌ రంగంలో అమ్మాయిలకు శిక్షణ - కల్పనా ఫెలోషిప్ ద్వారా ఇంటర్న్‌షిప్‌

Handwoven Products From Water Hyacinth : గుర్రపు డెక్కలతో అద్భుతాలు చేయడమే కాదు, మనిషి మనుగడకు అవసరమైన నీటి వనరులను కలుపు మొక్కల బారి నుంచి కాపాడుతున్నాడు ఈ యువకుడు. చెరువులలో ఈ మొక్కలను తీసివేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్న క్రమంలో వాటిని ఉపయోగించి పర్యావరణహితమైన మ్యాట్‌లు, చాపలు, బుట్టలు తయారుచేస్తున్నాడు. ఎటువంటి రసాయన పదార్థాలు(Chemical Substances) వాడని తమ ఉత్పత్తులు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయని అబ్దుల్‌ చెబుతున్నాడు.

గుర్రం డెక్కతో చేస్తున్న వస్తువులు అబ‌్దుల్‌కు ఎంతో పేరును తెచ్చాయి. దీంతో చాలా సంస్థలు, తనకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఆ ధైర్యంతోనే తన వ్యాపారాన్ని విదేశాల్లో సైతం విస్తరించాలని భావించి పలు దేశాల్లో అవగాహన కల్పిస్తున్నాడు. పది వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన అబ్దుల్‌, నేడు లక్షల రూపాయల లావాదేవీలు చేస్తున్నాడు.

గుర్రపు డెక్క నారతో చీరలు, బయోగ్యాస్‌ ఉత్పత్తే ధ్యేయం : ఆకులు, కాడలే కాదు వాటి వేర్లను కూడా వాడి సేంద్రీయ ఎరువులు తయారు చేయాలని ప్రయత్నిస్తున్నాడీ ఈ యువకుడు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే కొత్త ఉత్పత్తులు తయారు చేయాలన్న, తన ఉత్సాహం రెట్టింపు అవుతుందని అంటున్నాడు. భవిష్యత్తులో గుర్రపు డెక్క నుంచి బయోగ్యాస్(Biogas) తయారు చేయాలని, దీని నార నుంచి చీరలు నేయడమే తన లక్ష్యంగా అబ్దుల్‌ ముజీబ్‌ చెబుతున్నాడు.

భారత్‌లో హస్తకళా పరిశ్రమ ఇంకా కుటీర పరిశ్రమగానే ఉందని, లక్షల మంది ఆధారపడ్డ ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందటున్నాడు అబ్దుల్. ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా అక్కడ స్టాల్స్ పెడుతూ, ప్రజలకు పర్యావరణహిత వస్తువుల పట్ల అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నాడు ఈ యువకుడు.

డిగ్రీలు పూర్తి చేసి - సహజ సిద్దమైన వంట నూనె తయారీ వ్యాపారంలో రాణిస్తున్న ముగ్గురు మిత్రులు

సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాల తయారీ - ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.