Warangal Kakatiya University Problem : వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి పాలకమండలి లేకపోవడంతో వర్సిటీ సమస్యలకు నిలయంగా మారింది. కాకతీయ విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి పాలక మండలి గత ఏడాది అక్టోబర్ వరకు కొనసాగింది. ఆ తర్వాత కేవలం రాష్ట్ర ఆర్థిక, ఉన్నత, డిగ్రీ విద్యా కమిషనర్లు, కార్యదర్శులతో పాటు కేయూ వీసీ సభ్యుడిగా ఉండే తాత్కాలిక కార్యనిర్వాహక మండలి మాత్రమే కొనసాగుతోంది.
Problems at KU in Warangal : వర్సిటీలో పూర్తిస్థాయి పాలకమండలి లేకపోవడంతో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొంది. బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలతో పాటు విద్యార్థి, పరిశోధకుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఎలాంటి సమస్యలైనా పరిష్కరించడంలో పూర్తిస్థాయి ఈసీ లేదంటూ అధికారులు దాటవేస్తున్నారని, పది నెలల నుంచి కొత్త పాలక మండలి నియామకం కోసం నిరీక్షణే మిగిలుతోందని ఉద్యోగులు, పరిశోధకులు వాపోతున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం వీసీపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం - Vigilance Inquiry On KU VC
KU Vice Chancellor Issue : కేయూ 14వ ఉప కులపతిగా మూడేళ్ల పాటు విధులు నిర్వహించిన సామాజిక శాస్త్ర సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ పదవీ కాలం ఈ నెల 21తో ముగిసింది. ఇదివరకే రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం కూడా ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉప కులపతుల నియామకాలపై దృష్టి సారించింది. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని వీసీల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
KU Teachers and Students Demands : రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఇన్చార్జ్ వీసీల నియామకం చేసింది. కేయూ మినహా మిగతా తొమ్మిది వర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించింది. దరఖాస్తు చేసుకున్న ఆచార్యుల బయోడేటాలను పరిశీలిస్తోంది. వారి వివరాలను నిఘావర్గాల ద్వారా సేకరించి ఎంపిక ప్రక్రియను చకచకా కొనసాగిస్తోంది. కానీ కేయూకు పాలక మండలి లేకపోవడంతో సెర్చ్ కమిటీ సభ్యులను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించే అవకాశం లేక ఈ ప్రక్రియ కుంటుపడింది. కేయూకు పూర్తిస్థాయి పాలక మండలిని ఏర్పాటు చేసి, సెర్చ్ కమిటీని నియమించాలని, తద్వారా వీసీ నియామక ప్రక్రియ చేపట్టాలని ఉద్యోగ, అధ్యాపక, విద్యార్థి పరిశోధక వర్గాలు కోరుతున్నాయి.
Warangal KU Bandh Updates : కొనసాగుతోన్న వరంగల్ బంద్.. కేయూ వద్ద భారీగా పోలీసుల మోహరింపు