ETV Bharat / state

బస్సు భారమై, రైలు దూరమై - ఓట్ల పండక్కి వెళ్లేదెలా? - No Special trains for AP elections - NO SPECIAL TRAINS FOR AP ELECTIONS

special trains for elections in AP: హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ వాసులు ఈ సారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఆర్టీసీ బస్సెక్కుదామంటే జగనన్న ఛార్జీల బాదుడుతో వెనక్కి తగ్గుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ సిబ్బంది రెచ్చిపోతున్నారు. కానీ ఈసారి ఓట్ల పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్ల ఆవశ్యకతపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

special trains for elections in AP
special trains (ఈటీవీ భారత్)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 7:50 PM IST

special trains for elections in AP: హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ వాసులు ఈ సారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సొంతూళ్లకు వచ్చేందుకు సరిపడా రవాణా సదుపాయాల్లేక ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. రైళ్లలో వద్దామంటే బెర్తులన్నీ ఎప్పుడో నిండిపోయాయి. ఆర్టీసీ బస్సెక్కుదామంటే జగనన్న ఛార్జీల బాదుడుతో వెనక్కి తగ్గుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ సిబ్బంది రెచ్చిపోతున్నారు. మూడింతలు ఛార్జీలు పెంచి నిలువు దోపిడీ చేసేందుకు ప్లాన్ వేశారు. ఇన్ని అవాంతరాల మధ్య ఇక ఊరెలా వెళ్లేది, ఓటెలా వేసేది అన్నట్లు ఉంది ఏపీ ఓటర్ల పరిస్థితి.

రాష్ట్రంలో ఈ నెల 13 న పోలింగ్ జరగనుంది. ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు సొంతూళ్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏపీవాసులు 30 లక్షల పైనే ఉంటారని అంచనా. వీరంతా పోలింగ్ రోజున ఓటేసేందుకు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. మూడ్రోజుల ముందుగానే స్వరాష్ట్రానికి వచ్చేలా రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఏపీ మీదుగా వెళ్లే రైళ్లలో మే 8 నుంచి 13 వరకు వరకు బెర్తులన్నీ ఫుల్ అయిపోయాయి. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత దర్శనిస్తోంది. సాధారంగా పండుగ సమయాల్లో, రద్దీ రోజుల్లో రైల్వేశాఖ అదనపు రైళ్లను పట్టాలెక్కిస్తుంది. సాధారణ బోగీలతో నడిచే జన్ సాధారణ్ రైళ్లనూ నడుపుతోంది. గతంలో ఎన్నికల ముందు కూడా ఇలాంటి రైళ్లను నడిపారు. కానీ ఈసారి ఓట్ల పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లను నడపడం లేదు. ఫలితంగా లక్షలాది ఓటర్లు ఈ సారి ఓటింగ్‌కి వస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను 3 సార్లు పెంచింది. హైదరాబాద్‌ నుంచి కుటుంబంతో సహా విజయవాడకు వచ్చి పోవాలంటే కనీసం 5 వేలు టికెట్ ఛార్జీలకే చెల్లించాలి. ఇంతకు మించి దూరమైతే అదనపు భారం తప్పదు. దీంతో ఆర్టీసీ బస్సెక్కేందుకే జనం జంకుతున్నారు. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు ఆపరేటర్లు మూడింతలు ఛార్జీలు పెంచి దండుకుంటున్నారు. పోనీ ఎలాగోలా వచ్చేద్దామనుకుంటే.. మళ్లీ తిరుగు ప్రయాణంలోనూ బాదుడు తప్పదు. దీంతో చాలా మంది ఓటర్లు ఊళ్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
జగన్‌ పాలన విభజన కంటే రెట్టింపు బాధ - ప్రభుత్వ వ్యతిరేకతలో ఫ్యాన్‌ కనుమరుగు: చంద్రబాబు - Chandrababu Naidu Interview

హైదరాబాద్‌లోని కూకట్ పల్లి, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఏపీ ఓటర్లు ఎక్కువగా నివాసం ఉంటారు. వైసీపీ నేతలు ఓటర్లను తరలించేందుకు ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుంటున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. దీంతో పోలింగ్ ముందు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకు తిరిగే సాధారణ ప్రైవేటు బస్సులు సైతం భారీగా తగ్గిపోనున్నాయి. దీని ప్రభావంతో సామాన్యులు అత్యధిక ఛార్జీలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిస్తోన్న ఎన్నికల కమిషన్, ఇతర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు స్వస్థలాలకు వచ్చే వారికి మాత్రం ఎలాంటి రవాణా సదుపాయాలు కల్పించడం లేదు. ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకువచ్చే బాధ్యత వారిదే అయినా, ఆ దిశగా ఉన్నతాధికారులు దృష్టి పెట్డడం లేదు. ఇప్పటికైనా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ వాసుల కోసం అదనంగా ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.

అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయొచ్చు: కూటమి నేతలు - ap nda leaders meeting

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.