ETV Bharat / state

వైసీపీ ఎన్నికల ప్రచారం ఎఫెక్ట్​- 30 మంది వాలంటీర్లపై వేటు

volunteers participate YCP election campaign authorities Dismissed: ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకుంటూ వైసీపీకి ఊడిగం చేస్తున్న 30 మంది వాలంటీర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఇది వరకే ఈసీ ఆదేశాలు జారీ చేసినా కొంతమంది వాటిని ఖాతరు చేయడం లేదు.

volunteers participate YCP election campaign authorities Dismissed

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 7:03 AM IST

వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 30 మంది వాలంటీర్లపై వేటు- విధుల నుంచి తొలగించిన అధికారులు

Volunteers Participate YCP Election Campaign Authorities Dismissed: ఎన్నికల సంఘం ఆదేశాల్ని వాలంటీర్లు ఖాతరు చేయడం లేదు. వైసీపీ నేతలకు అనుకూలంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. ఈసీ నిబంధనలు అతిక్రమించిన 30 మంది వాలంటీర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. అయినా స్థానిక నేతల ఒత్తిడితో కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకుంటూ వైసీపీకి ఊడిగం చేస్తున్న 30 మంది వాలంటీర్లపై వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉన్నత అధికారులు 30 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్‌ను విడిచి వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన సిద్ధం గ్రామ స్థాయి సభలో మేమూ సిద్ధమే అంటూ పాల్గొన్న 16 మంది గ్రామ వాలంటీర్లను అక్కడి అధికారులు డిస్మిస్‌ చేశారు. ఇరుసుమండ, మొసపల్లి గ్రామాలకు చెందిన 16 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు- వైసీపీ నేతలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు

వాలంటీర్లపై వేటు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వేముగోడులో వైసీపీ నిర్వహించిన మేము సిద్ధం మా బూత్‌ సిద్ధంలో పాల్గొన్న ఏడుగురు వాలంటీర్లపై స్థానికులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాలంటీర్లు బాలకృష్ణారెడ్డి, బాకర్‌బీ, అపర్ణ, కామాక్షి, పుష్పవతి, లక్ష్మన్న, మద్దిలేటిని అధికారులు విధుల నుంచి తప్పించారు. ఎమ్మిగనూరు 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక తరఫున ప్రచారం చేసిన నరసింహులును విధుల నుంచి అధికారులు తొలగించారు. కర్నూలు 127వ వార్డుకు చెందిన వాలంటీరు మనోజ్‌కుమార్‌ కొత్తపేటలో వైసీపీ తరపున ప్రచారం చేయగా విధుల నుంచి తొలగించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ముగ్గురు వార్డు వాలంటీర్లు, ఓ వీఆర్వోపై వేటు వేశారు. వారిపై కేసు నమోదు చేయాలని ఆర్డీవో ఆదేశాలిచ్చారు. చేజర్ల మండలం పాడేరులో మేకపాటి విక్రం రెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, పవన్, వంశీ, వీఆర్వో ప్రసాద్‌పై అదికారులు వేటు వేశారు. సంగం ఎంపీడీవో కార్యాలయంలో రాజకీనాయకులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న వాలంటీర్‌ ప్రసాద్ ముదిరాజ్​పై కేసు నమోదు చేయాలని ఆర్డీవో ఆదేశించారు.

ఎన్నికల్లో లబ్దిపొందేందుకు వైసీపీ సరికొత్త ఎత్తుగడ- వాలంటీర్లకు నగదు పురస్కారం పెంపు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మెళియాపుట్టిలో వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు ఓంశ్రీకృష్ణ చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు ఎం.మణికంఠను విధుల నుంచి దూరం పెట్టారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన వాలంటీర్లు విజయలక్ష్మి, దుర్గాభవానీని విధుల నుంచి తప్పించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాకలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు మురళిని విధుల నుంచి తీసేశారు. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి ప్రచారంలో వాలంటీరు రఫీ పాల్గొన్నారు. ఈ విష.యంపై జనసేన నేత శోభన్‌బాబు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఎంపీడీవో కార్యాలయంలో వాలంటీర్ జన్మదిన వేడుకలు - ప్రతిపక్షాల మండిపాటు

విధుల నుంచి తొలగింపు: చిత్తూరు జిల్లాలో నిబంధనలు అతిక్రమించి వైసీపీ ప్రచారాల్లో పాల్గొన్న ఒప్పంద ఉద్యోగులనూ విధుల నుంచి తొలగించారు. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం చీకటిపల్లి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు వెంకటేష్, కుప్పం మండలం సాంకేతిక సహాయకుడు మురుగేష్‌ను విధుల నుంచి తప్పించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వార్డు వాలంటీరు జె.రవిని విధుల నుంచి తీసేశారు. పట్టణ చౌకధరల డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు మేకల శ్రీనివాసులు, డీలర్లు వంశీకృష్ణ, కృష్ణమూర్తి, రఫీక్‌ డీలర్‌ షిప్‌లను రద్దు చేశారు.

సచివాలయంలో కొట్టుకున్న వాలంటీరు, ఉద్యోగి- సామాజిక మాధ్యమాల్లో వైరల్

వైసీపీ ప్రచారంలో వాలంటీర్లు: ఎన్నికల సంఘం ఆదేశాలు, ప్రవర్తనా నియమావళిని లెక్క చేయకుండా వైసీపీ అనుకూల ప్రచారాన్ని చేపట్టిన వాలంటీర్లు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని అధికారులు డిస్మిస్‌ చేస్తున్నా మరికొందరు ఆ పార్టీకి ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. స్థానిక వైసీపీ నేతలు ఐప్యాక్‌ సభ్యులు, మండల స్థాయి అధికారుల ఒత్తిడి భరించలేక కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ పీసీపల్లి మండలంలోని నేరేడుపల్లి, పోతవరం, వరిమడుగు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో కనిగిరి ఆర్టీసీ డిపో కండక్టర్‌ ఓబుల కొండారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ నాయకురాలు, పీసీపల్లి జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీకాంతం భర్త కొండారెడ్డిగా తెలిపారు. పొదిలిలో మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు కుమారుడు కృష్ణచైతన్య వెంట మల్లవరం విద్యుత్తు ఉపకేంద్రం షిఫ్టు ఆపరేటర్‌ షేక్‌ గౌస్‌ మొహియుద్దీన్‌ పాల్గొని ప్రచారం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్‌నాయుడు యడ్లపాడులో నిర్వహించిన ప్రచారంలో వీఆర్‌ఏ అంబటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వైసీపీకి ప్రచారం చేస్తున్న వాలంటీర్ - వైరల్ అవుతున్న వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.