Viveka Murder Case Approver Dastagiri Petition : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. తన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో (AP Ex MP Viveka Murder Case) అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి అప్రూవల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. సీబీఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దస్తగిరి భద్రత పిటిషన్‌పై మధ్యాహ్నం సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశారు.
Sunitha Lawyer Arguments: "కొత్త థియరీలతో అవినాష్ మైండ్‌గేమ్.. జగన్‌కు సమాచారంపై సీబీఐ తేల్చాలి"
అదే విధంగా వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి (Viveka Murder Case Approver Dastagiri) అప్రూవల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. తనని ముద్దాయిగా కాకుండా సాక్షిగానే పరిగణించాలని దస్తగిరి పిటిషన్ వేశారు. పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, అప్రూవల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.
Dastagiri petetion వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. న్యాయ సహాయం అందించాలంటూ సుప్రీంకు దస్తగిరి