ETV Bharat / state

విశాఖ శారదాపీఠానికి భారీ షాక్ - భూ కేటాయింపులు రద్దు - SARADA PEETHAM LAND CANCELLED

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు

Visakha_Sarada_Peetham
Visakha Sarada Peetham Land Allotment Cancelled (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 10:51 PM IST

Updated : Oct 20, 2024, 10:06 AM IST

Visakha Sarada Peetham Land Allotment Cancelled : విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్‌ సర్కార్ అప్పనంగా కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భూకేటాయింపు రద్దు ప్రతిపాదనకు వచ్చే కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేయనుంది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ తన గురువు, అత్యంత సన్నిహితుడైన స్వరూపానందేంద్ర. ఆయన కోరిందే తడవుగా భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గర్లో రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున అడ్డగోలుగా ఇచ్చేశారు. గత సర్కార్ హయాంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం దీన్ని గుర్తించింది. శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

అడ్డగోలు కేటాయింపు - ఆపై అనేక వెసులుబాట్లు! : వైఎస్సార్సీపీ పాలనలో జగన్‌కు రాజగురువుగా ఒక వెలుగు వెలిగిన స్వరూపానందేంద్ర ఎంతో విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు. సంస్కృత పాఠశాల నెలకొల్పి, వేద విద్యను వ్యాప్తి చేసేందుకు, పీఠానికి సంబంధించిన ఇతర కార్యకలాపాల నిర్వహణకు భూములు కేటాయించాలంటూ ఆ ముసుగులో సర్కార్​కి ఓ విజ్ఞప్తి పడేశారు. అంతటి రాజగురువే అడిగితే కాదనేదేముంది! చకచకా ఫైల్ కదిలింది.

భీమిలిని ఆనుకుని ఉన్న కొండపై 102/2 సర్వే నంబరులో 7.70 ఎకరాలు, 103లో 7.30 ఎకరాల్ని జగన్‌ సర్కార్ స్వరూపానందేంద్రకు కేటాయించింది. రూ.225 కోట్లు విలువ చేసే ఆ భూముల్ని శారదా పీఠానికి ఎకరం రూ.లక్ష చొప్పున రూ.15 లక్షలకు కట్టబెడుతూ 2021 నవంబర్​లో జీఓ ఇచ్చేసింది. ఆ తర్వాతే స్వామీజీ అసలు స్వరూపం బయటపెట్టారు. పీఠానికి ఆదాయం సమకూర్చుకోవడానికి ఆ భూముల్ని వాడుకోవాలన్నది తమ ఉద్దేశమని, దానికి వీలు కల్పిస్తూ జీఓను సవరించాలని తన వారసుడు, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రతో 2023 నవంబర్ 20న ముఖ్యమంత్రికి లేఖ రాయించారు.

‘పీఠం కార్యకలాపాలకు అవసరమైన ఆదాయ సముపార్జన కోసమే విశాఖపట్నంలోని సాగర తీరంలో, అది కూడా వాణిజ్య, నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలోని భూములు కేటాయించాల్సిందిగా కోరాం. కానీ జీఓలో మాత్రం వేద విద్య వ్యాప్తికి, పీఠం కార్యకలాపాల విస్తరణకు అని రాశారు. ఆ కార్యకలాపాల్ని పీఠం ఇప్పటికే ఏపీ, తెలంగాణలతో పాటు వారణాసి, రుషికేశ్‌లలోని 60 కేంద్రాల్లో చేస్తోంది. ఆ భూముల్ని జీఓలో ప్రస్తావించిన అవసరాల కోసం వాడుకోవాల్సిన పనిలేదు. వేదపాఠశాల, సంస్కృత విద్య వ్యాప్తికి ఆ స్థలం కోరినట్టు జీఓలో పొరపాటున రాసినట్టున్నారు. జీఓలో మార్పులు చేయాల్సిందిగా కోరుతున్నాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. స్వామీజీ కోరిక మేరకు అడ్డగోలుగా అనేక వెసులుబాట్లు కల్పిస్తూ, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 2024 ఫిబ్రవరిలో జగన్‌ సర్కార్ సవరించిన జీఓ విడుదల చేసింది.

కేబినెట్‌పైకి తోసేస్తే పోలా! : శారదాపీఠానికి భూకేటాయింపులో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ఆ వ్యవహారం తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఉద్దేశంతో, మొత్తం నెపాన్ని అప్పటి మంత్రివర్గం పైకి నెట్టేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తమ ప్రమేయమేమీ లేదని, అంతా అప్పటి కేబినెట్‌ నిర్ణయమేనన్నట్టు చెప్పాలని చూస్తున్నట్టు తెలిసింది. శారదాపీఠానికి భూ కేటాయింపులు ఏ విధంగా నిబంధనలకు విరుద్ధమో వివరిస్తూ రెవెన్యూశాఖ నోట్‌ తయారు చేసింది. అప్పట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారుల దృష్టికి ఆ విషయం వెళ్లడంతో ‘అబ్బబ్బే అవన్నీ ఇప్పుడెందుకు? కేటాయింపుల్ని రద్దు చేయాలని సింపుల్‌గా రాస్తే సరిపోతుంది కదా’ అని ఒత్తిడి తెస్తున్నట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

'శారదా పీఠానికి కేటాయించిన కొండ అనుమతులు రద్దు చేయాలి' - హిందూ ధార్మిక సంస్థల డిమాండ్ - SARADA PEETHAM land

Last Updated : Oct 20, 2024, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.