ETV Bharat / state

వర్షాలతో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు - అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు - Viral Fever Cases Rising In AP - VIRAL FEVER CASES RISING IN AP

Viral Fever Cases Rising In AP : వాతావరణ మార్పులతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు రోగుల తాకిడి భారీగా పెరిగింది. సాధారణ జ్వరాలతో పాటు వైరల్ ఫీవర్స్ చుట్టుమట్టడంతో బాధితులు అల్లాడిపోతున్నారు. ఒంట్లో ఏ మాత్రం తేడాగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

Viral Fever Cases Rising In AP
Viral Fever Cases Rising In AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 8:29 PM IST

Viral Fever Cases Rising In AP : రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరాలతో పాటు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వైద్యులు శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జ్వరాలు పెరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

పెరుగుతున్న విష జ్వరాలతో అల్లాడుతోన్న ప్రజానికం- ఆ ఇంజక్షన్లు తీసుకోవద్దంటున్న వైద్యులు - toxic fevers

వర్షాకాలం రావటంతో సీజనల్ వ్యాధుల సంఖ్య పెరుగుతోంది. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై జనరల్ ఫిజీషియన్ డా. శ్రీనివాసరావు మాట్లాడుతూ, " ఇప్పటివరకు మలేరియా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలు వరకు నమోదు అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటి ప్రమాద తీవ్రత స్థాయి తక్కువగానే ఉంది. చాలా మందికి ఇంటి వద్దేనే చికిత్స పొందుతున్నారు. హటాత్తుగా వాతావరణంలో మార్పులు జరిగితే దోమలు పెరుగుతాయి.

అలాగే గాలిలో ఉన్న వైరస్ లను ముందుగా దోమలు తీసుకుంటాయి. వాటి లార్వా నుంచి మనిషి శరీరంలోకి ఆ వైరస్​లు చేరుతాయి. దీంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. అలాగే పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరుగుతున్నాయి. దీనివల్ల మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు సోకి రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ రోగాలతో వచ్చిన అందరికీ లక్షణాల ఆధారంగా పరీక్షలు చేస్తున్నాము. అదేవిధంగా ఫీవర్ కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే జ్వరాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం" అని డా. శ్రీనివాసరావు తెలిపారు.

తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజెక్షన్‌ వికటించి 20 మందికి అస్వస్థత - people fell ill due to injection

అలాగే పట్టణాల్లో జ్వరాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నిల్వ ఉన్న నీటిని తొలగించి, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మలేరియా జ్వరాలు అధికంగా వస్తున్నాయని.. తీవ్రతను గుర్తించి సకాలంలో ఆసుపత్రికి వెళ్లకుంటే ప్రమాదముంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా గ్రామస్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. అందరికీ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు.

గ్రామంలో ఇప్పటికే తాగునీరు, రక్త నమూనాలు సేకరించామని వైద్యులు చెబుతున్నారు. ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జ్వరం వచ్చిన వారంతా నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఖరీదైనా స్టెరాయిడ్ ఇంజక్షన్​లు వాడుతున్నారని అందుకే కీళ్ల ప్రాంతంలో వాపులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

నీటి నమూనాల్లో హానికర బ్యాక్టీరియా - విషజ్వరాలతో అల్లాడుతున్న గ్రామస్థులు - People Suffering Fever

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.