CM Chandrababu Presented Vikasit AP 2047 Vision Document : వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ వికసిత్ భారత్ 2047 అజెండాపై నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో జరిగిన చర్చలో వికసిత్ వికసిత్ ఏపీ 2047 అంశాలను చంద్రబాబు ప్రసావించారు. దేశాభివృద్ధిలో అమరావతి, పోలవరం పాత్రను సీఎం వివరించారు. వ్యవసాయం, ఆక్వా రంగాల అవకాశాలను జీడీపీ గ్రోత్ రేట్ లక్ష్యం చేపట్టే ప్రణాళికలను చంద్రబాబు ప్రస్తావించారు. సేవారంగం అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలు డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను భేటీలో చంద్రబాబు వివరించారు.
నీతి ఆయోగ్ భేటీలో విజన్ 2047 డాక్యుమెంట్‌పై మాట్లాడిన చంద్రబాబు, గతంలో తాను రూపొందించిన విజన్-2047పై ప్రస్తావించారు. విజన్ 2047 డాక్యుమెంట్ దేశానికి ఉపయోగపడేలా చేసినట్లు చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో 'గ్రీన్ టెక్నాలజీ' వినియోగించాలని, విద్య, వైద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు. హైడ్రోజన్ వినియోగం, విద్యుత్ రంగంలో సంస్కరణలపై శ్రద్ధ పెట్టాలని, పేదరికం రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.